ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లకు బదులుగా ప్రైవేటు స్కూళ్లకు పంపుతున్నారు. డిమాండ్ పెరగడంతో ప్రైవేటు స్కూల్స్‌కు కూడా భారీగా ఫీజులను పెంచేస్తున్నాయి. కేవలం నర్సరీకే లక్షల్లో ఫీజులు వస్తూ చేస్తున్నారు. దీంతో పిల్లల స్కూల్ ఫీజులు కట్టాలంటే తల్లిదండ్రులకు తలప్రాణం తోకకొస్తుంది. అంతో ఇంతో సంపాదన ఉన్న వాళ్ల పరిస్థితి కాస్తా ఒకే అనుకున్నా.. మధ్య తరగతి కుటుంబాల పరిస్థితి మాత్రం మరీ దారుణంగా మారింది.. తాము కష్టపడి సంపాధిండే డబ్బులు మొత్తం పిల్లల స్కూలు ఫీజులకే సరిపోతుంది.
హైదరాబాద్‌లో పిల్లలకి ABCDలు నేర్పించడమంటే ఇప్పుడు చాలా పెద్ద విషయమండోయ్. ఎందుకంటే అందుకు అయ్యే ఖర్చు నెలకు రూ. 21,000. అవును, మీరు కరెక్ట్‌గానే చదువుతున్నారు. ఇక్కడ ఒక ప్రైవేట్ స్కూల్ ఈ లెవెల్ లో ఫీజులు వసూలు చేస్తున్న విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. టెడ్ఎక్స్ స్పీకర్ అనురాధ తివారీ ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. దీంతో ఓ రేంజ్ కామెంట్స్ వస్తున్నాయి. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఈ డబ్బుతో ఏడాది బ్రతుకుతుంది కదా అని ఒకరు కామెంట్ పెట్టారు. విద్య ఎప్పుడో వ్యాపారం అయింది అని మరొకరు అన్నారు. పిండి కొద్ది రొట్టె.. అందుకు తగ్గటే అక్కడ స్టాండర్డ్స్ ఉంటాయి. మీకు స్తోమత ఉంటేనే అక్కడికి పంపండి అని మరొకరు వ్యాఖ్యానించడం గమనార్హం. విద్య గురించి పక్కన పెడితే.. స్కూల్స్ ఎప్పుడో స్టేటస్ సెంటర్స్ అయిపోయాయి.
కాగా ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కాలేజీల ఫీజులపై నియంత్రణ అవసరం అనే అభిప్రాయాలు పెరుగుతున్న నేపథ్యంలో.. తెలంగాణ ప్రభుత్వం తాజగా .. తెలంగాణ ఫీజు రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ అనే బిల్లును తీసుకురాబోతుంది. ప్రజెంట్ ఈ బిల్లు రివ్యూ స్టేజ్‌లో ఉంది. ఈ బిల్లు అమల్లోకి వస్తే తమ పిల్లను ప్రవేటు స్కూల్‌కు పంపించే మధ్య తరగతి కుటుంబాలకు పెనుభారం తగ్గనుంది.