మాంసంప్రియులకు పండుగ.. పులస దొరికేసిందోచ్.. ఎంత ధర పలికిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.!

తింటే గోదావరి చేప తినాలి అంటారు. అందులో వర్షాల సీజన్‌లో పులస చేప కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటిది.. ఒకేసారి రెండు పులుసు దొరికితే మాంసపు ప్రియులు ఊరుకుంటారా..! వేలం పాటలో వేలకు వేలు వెచ్చించి సొంతం చేసుకుంటున్నారు. ఒకపక్క పులస 29 వేల రూపాయలు పలికితే, మరో పులస 28,000 రూపాయలు పలికింది. ఇదే కాదు కోతవీడు దూరంలోనే పులస తర్వాతే ఇష్టపడే చేప పండుగప్ప ఇదేం తక్కువ లేదు. దాదాపు 16,000 రూపాయల ధర పలికింది.

యానం గోదావరిలో రెండు పులుసు చేపలు మత్స్యకారుల వలకు చిక్కాయి. దీంతో ఒక్కో పులస చేప 29,000 రూపాయలు, మరొకటి 28,000 రూపాయల అధిక ధర పలికాయి. యానం చేపల మార్కెట్ వేలం పాటలో 1.5 కేజీల పులస.. 29 వేల రూపాయలు పలికితే,1.4 కేజీల బరువు గల పులస 28,000 రూపాయలు పలికింది. ఇటీవల కాలంలో పులస చేపలు చాలా అరుదుగా దొరకడంతో పులస చేపల ధర ఆకాశాన్ని తాకింది. పులస ఇంత ధర పలకడానికి పులస రుచి ముందు మిగతా చేపలు రుచి దిగదుడిపే కారణం అంటున్నారు మాంసపు ప్రియులు.

ఇదిలావుంటే, యానాంలో గోదావరి, సముద్రం కలిసే సంగమ ప్రాంతంలో మత్స్యకారుల వలకు చిక్కింది 20.300 కేజీల భారీ పండుగప్ప చేప. యానాం రేవులో వేలానికి వచ్చిన ఈ భారీ చేపను 16 వేల రూపాయలకు ఫ్రాన్సుతిప్పకు చెందిన పెమ్మాడి వెంకటేష్ కొనుగోలు చేశాడు. చేపల్లో పులస రారాజు అయితే, ఆ తర్వాతి స్థానం పడుగప్ప చేపదే. ప్రోటీన్ అధికంగా ఉండే ఈ చేపలో ఒమేగా -3 ప్యాటీ యాసిడ్స్, విట మిన్ బి-12 వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇగురు కూర, వేపుడుగా గోదావరి జిల్లాల్లో వండుకోవడం పరిపాటి. ఇవి అన్ని కాలాల్లోనూ ఇటు నదుల్లో, అటు సముద్రంలో లభిస్తాయి. ఇటీవల ఈ స్థాయి చేప లభించడం ఇదే తొలిసారి అని మత్య్సకారులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఒకపక్క వరద గోదావరి మరోపక్క పులసలు పండుగప్పల కోసం ఎదురుచూస్తున్నారు చేప ప్రియులు.

About Kadam

Check Also

అరుణ అరచకాలు మామూలుగా లేవుగా.. ఏకంగా గన్నుతోనే బెదిరించింది.. మరో కేసు నమోదు..

నెల్లూరు లేడీ డాన్‌ నిడిగుంట అరుణ మెడకు ఉచ్చు మరింత బిగుస్తోంది.. ఆమెపై వరస కేసులు నమోదవుతున్నాయి.. తాజాగా.. మరో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *