నిరుద్యోగులకు ఎగిరిగంతేసే న్యూస్.. రైల్వేలో భారీగా నియామకాలకు కొత్త నోటిఫికేషన్‌ వచ్చేస్తుందోచ్‌!

ఇండియన్‌ రైల్వే మరో ఉద్యోగ నోటిఫికషన్‌ విడుదలకు రైల్వేశాఖ సమాయాత్తమవుతోంది. దేశ వ్యాప్తంగా ఉన్న 17 రైల్వే జోన్లు, వివిధ ఉత్పాదక యూనిట్లలో.. సిగ్నల్, టెలికమ్యూనికేషన్ విభాగంతో సహా మొత్తం 51 కేటగిరీలలో సాంకేతిక పోస్టుల భర్తీకి సన్నాహాలు చేస్తుంది. ఇందులో దాదాపు 6,374 ఖాళీలను భర్తీ చేయాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. భర్తీ ప్రక్రియకు సంబంధించి జూన్ 10న రైల్వే మంత్రిత్వ శాఖ అన్ని జోనల్ రైల్వేలకు లేఖ రాసింది. ఆన్‌లైన్ మానవ వనరుల నిర్వహణ వ్యవస్థలోని టెక్నీషియన్‌ ఖాళీలను అంచనీ వేసినట్లు అందులో తెలిపింది. ఈ పోస్టులను 2025 సంవత్సరానికి 51 కేటగిరీలలో 6,374 టెక్నీషియన్ల ఖాళీలకు కేంద్రీకృత ఉపాధి నోటిఫికేషన్ జారీ చేయడానికి ఆమోదం తెలిపినట్లు వెల్లడించింది.

బెంగళూరులోని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) ఛైర్మన్‌తో సంప్రదించి మొత్తం 51 కేటగిరీలలో ఖాళీగా ఉన్న పోస్టులను సవరించి ఆన్‌లైన్ వ్యవస్థలో అప్‌లోడ్ చేయాలని మంత్రిత్వ శాఖ అన్ని జోన్‌లను ఈ లేఖలో కోరింది. రైల్వేలు/ఉత్పాదక యూనిట్లలో ఉంచిన ఇండెంట్లను నోడల్ RRB ఏకీకృతం చేసి కేంద్రీకృత ఉపాధి నోటిఫికేషన్ జారీ చేస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా రైల్వేలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి రైల్వే మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు భర్తీ ప్రక్రియను చేపడుతోంది.

మరోవైపు ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని జోన్లలో వివిధ కేటగిరీల్లో ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ ఉద్యోగాలకు సంబంధించి నియామక ప్రక్రియ ప్రారంభమైంది. దేశ వ్యాప్తంగా ఈ నెల చివరి వరకు ఆన్‌లైన్‌ రాత పరీక్షలు నిర్వహిస్తుంది. ఈ పరీక్షలకు దాదాపు 1.2 కోట్ల మంది నిరుద్యోగులు హాజరుకానున్నారు. ఇక తాజాగా రైల్వేలో ఖాళీగా ఉన్న 6,374 టెక్నీషియన్‌ పోస్టుల భర్తీని త్వరలోనే ప్రారంభించనున్నట్లు రైల్వేశాఖ వెల్లడించింది. ఈ పోస్టులను సిగ్నల్‌, టెలికమ్యూనికేషన్‌ సహా 51 కేటగిరీల్లోని గ్రేడ్‌ -సి కింద భర్తీ చేయనున్నారు. సిగ్నల్‌, టెలికాం విభాగంలో చివరిసారిగా 2017లో నియామకాలు జరిగాయి. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ ఆ విభాగం నియామక ప్రక్రియ చేపట్టింది.

About Kadam

Check Also

ఉపాధి హామీలో ఇకపై అలా నడవదు.. రెండు సార్లు ఫొటో దిగితేనే కూలీలకు డబ్బులు..

ఉపాధి హామీ పథకం.. ఎంతో మంది నిరుపేద గ్రామస్థులకు ఈ పథకం ఒక వరం. గ్రామాల్లో సరిగ్గా పని లేనివారిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *