ప్రతి రైలు టికెట్‌పై 46 శాతం రాయితీ.. పార్లమెంట్‌లో రైల్వే మంత్రి కీలక విషయాలు!

 దేశంలోనే రైల్వే స్టేషన్‌ అప్‌గ్రేడేషన్‌కు సంబంధించి ప్రభుత్వం అతిపెద్ద రైల్వే స్టేషన్ అప్‌గ్రేడేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిందని రైల్వే మంత్రి తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్‌ను భారత్‌లో అప్‌గ్రేడ్ చేసే పనులు కొనసాగుతున్నాయని, ప్రస్తుతం..

భారత రైల్వే ద్వారా ప్రయాణికులకు ఎన్నో సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తున్నామని, అన్ని రకాల రైలు టికెట్లపై రాయితీలు కల్పిస్తున్నామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగా మంత్రి లోక్‌ సభలో పలు కీలక విషయాలను వెల్లడించారు. అన్ని రకాల టికెట్లపై ప్రతి సంవత్సరం రూ.56,993 కోట్ల రాయితీని కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని వెల్లడించారు. ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ పలు విషయాలను సభకు వెల్లడించారు.

దేశంలోని ప్రతి రైల్వే ప్రయాణికుడికి ప్రయాణ టిక్కెట్‌పై 46 శాతం సబ్సిడీ ఇస్తున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్‌ను భారత్‌లో అప్‌గ్రేడేషన్ చేస్తోందని చెప్పారు. ప్రతి ప్రయాణికుడి టికెట్‌పై రూ.100 వెచ్చించాల్సి ఉంటే కేవలం రూ.54 మాత్రమే ఖర్చు పెట్టేలా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. రైల్వే కల్పిస్తున్న ఈ రాయితీ సదుపాయం అన్ని కేటగిరిల ప్రయాణికులకు వర్తిస్తుందని అన్నారు. ఇక రైల్వేలో వేగవంతమైన సేవలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు.

About Kadam

Check Also

బ్రదరూ.! బీ కేర్‌ఫుల్.. 90 రోజుల్లో పెండింగ్ చలాన్లు కట్టకపోతే ఇకపై వెహికల్స్ సీజ్

ఇప్పటికే పలు రోడ్డు ప్రమాదాలు విషయంలో హెల్మెట్స్ పెట్టుకోకపోవడమే కారణం కావడంతో సీరియస్ అయిన హైకోర్టు.. పోలీసులకు కీలక ఆదేశాలను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *