రాజాసింగ్ రాజీనామాను అధిష్ఠానం ఆమోదించడంతో రాజాసింగ్ దారెటు అనే చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే.. బీజేపీ అధిష్ఠానం తన రాజీనామా ఆమోదించడంపై రాజాసింగ్ స్పందించారు. 11 ఏళ్ల కిందట ఇదే రోజు బీజేపీలో చేరానని.. తనను నమ్మి మూడు సార్లు బీజేపీ టికెట్ ఇచ్చిందని రాజాసింగ్ చెప్పారు.
గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామాను బీజేపీ (భారతీయ జనతా పార్టీ) అధిష్ఠానం ఆమోదించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక విషయంలో అలిగిన రాజాసింగ్ జూన్ 30న పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ వేసేందుకు తనను అనుమతించలేదని, అందుకే రాజీనామా చేశానని ప్రకటించారు. రాజాసింగ్ రాజీనామాను అమోదిస్తున్నట్లు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ పేరుతో లేఖ విడులైంది. రాజాసింగ్ రాజీనామాను అధిష్ఠానం ఆమోదించడంతో రాజాసింగ్ దారెటు అనే చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే.. బీజేపీ అధిష్ఠానం తన రాజీనామా ఆమోదించడంపై రాజాసింగ్ స్పందించారు. 11 ఏళ్ల కిందట ఇదే రోజు బీజేపీలో చేరానని.. తనను నమ్మి మూడు సార్లు బీజేపీ టికెట్ ఇచ్చిందని రాజాసింగ్ చెప్పారు. ఇన్ని రోజులు తనకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు చెప్పారు రాజాసింగ్. తన చివరి శ్వాస వరకు హిందుత్వం, సనాతనధర్మం.. జాతీయవాదం కోసం పనిచేస్తానని ట్వీట్ చేశారు.
రాజీనామా ఆమోదం అనంతరం రాజాసింగ్ ఏమన్నారంటే..
11 ఏండ్ల క్రితం ఇదే రోజు.. ప్రజలకు, దేశానికి సేవ చేసేందుకే బీజేపీలో చేరినట్లు రాజాసింగ్ పేర్కొన్నారు. పార్టీ నమ్మి తనకు వరుసగా మూడుసార్లు టికెట్ ఇచ్చిందని.. ఇన్నిరోజులు తనకు సహకరించిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడానికి రాత్రి, పగలు తేడాలేకుండా కష్టపడుతున్న లక్షలాది మంది కార్యకర్తల కృషిని ఢిల్లీకి తెలియజేయడంలో తాను విఫలమయ్యానంటూ రాజాసింగ్ చెప్పారు. తాను పార్టీలో ఎలాంటి పదవి, అధికారాన్ని ఆశించలేదని.. వ్యక్తిగతంగా పేరు కోసం కూడా ప్రయత్నించలేదన్నారు. తన చివరి శ్వాస వరకు హిందుత్వవాదం, సనాతన ధర్మం, జాతీయవాదం కోసం పనిచేస్తూనే ఉంటానంటూ రాజాసింగ్ పేర్కొన్నారు. తన చివరి శ్వాస వరకు సమాజ సేవ కోసం, హిందూ సమాజ హక్కుల కోసం గొంతుకను వినిపిస్తూనే ఉంటానంటూ పేర్కొన్నారు.