బీసీ రిజర్వేషన్ల బిల్లుపై గందరగోళం.. స్పందించిన రాజ్‌భవన్.. ఇదే అసలు విషయం!

తెలంగాణ బీసీ రిజర్వేషన్ల బిల్లు అమోదం లభించిందంటూ వార్తలు వెలువడ్డాయి.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వార్తపై రాజ్‌భవన్ అధికారులు స్పందించారు. ఈ వార్త అవాస్తమని గవర్నర్ బంగ్లా అధికారులు తెలిపారు. తెలంగాణ బీసీ రిజర్వేషన్ల బిల్లు ఇంకా పెండింగ్‌లోనే ఉందని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల బిల్లుపై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. అయితే కొన్ని గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ.. జారీ చేసిన మెమోతో ఈ గందరగోళం నెలకొందని వివరించారు.

ఇదిలావుంటే, తెలంగాణలో 42శాతం బీసీ రిజర్వేషన్లకు రాష్ట్ర గవర్నర్ లైన్ క్లియర్ అయ్యిందని.. సోషల్ మీడియాలో ప్రచారం అయ్యింది. పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ చట్ట సవరణకు గవర్నర్‌ ఆమోదం తెలిపినట్లు, 50 శాతం రిజర్వేషన్ల క్యాప్‌ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంటున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ మేరకు స్పందించిన రాజ్‌భవన్ అధికారులు ఇదంతా అవాస్తవమని తేల్చి చెప్పారు.

About Kadam

Check Also

నిరుద్యోగులకు భలే న్యూస్.. ఆర్టీసీలో డ్రైవర్, కండక్టర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ వచ్చేసిందోచ్‌!

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎట్టకేలకు నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఎప్పుడాని ఊరిస్తున్న ఆర్టీసీ ఉద్యోగాలకు మోక్షం కలిగిస్తూ ఉద్యోగ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *