రాజ్యసభ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ.. ఏపీ నుంచి ఆర్.కృష్ణయ్య

ఇట్స్‌ అఫీషియల్‌. బీజేపీ నుంచి రాజ్యసభకు ఆర్‌.కృష్ణయ్య నామినేషన్‌ దాఖలు చేయబోతున్నారు. ఆయన పేరును బీజేపీ హైకమాండ్‌ ఖరారు చేసింది. ఆర్‌.కృష్ణయ్య అమరావతిలో రేపు నామినేషన్‌ దాఖలు చేస్తారు.

మూడు రాజ్యసభ స్థానాలకు బీజేపీ అభ్యర్ధులను ప్రకటించింది. ఏపీ నుంచి ఆర్.కృష్ణయ్య, హరియానా నుంచి రేఖా శర్మ, ఒడిశా నుంచి సుజీత్ కుమార్ పేర్లను ఖరారు చేసింది. బీసీ ఉద్యమ నేత కృష్ణయ్య ఇటీవల వైసీపీకి, రాజ్యసభ స్థానానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు బీజేపీ ఆయనకు మరోసారి అవకాశం కల్పించింది. ఇక రాజ్యసభ ఉపఎన్నికల నామినేషన్‌కు తుదిగడువు రేపటితో ముగియనుంది. కూటమి తరపున రేపు ముగ్గురు నేతల నామినేషన్‌ వేయనున్నారు. అందులో బీజేపీ నుంచి ఆర్‌.కృష్ణయ్య నామినేషన్‌ దాఖలు చేస్తారు. ఇప్పటికే హైదరాబాద్‌ నుంచి విజయవాడ బయల్దేరారు ఆర్‌.కృష్ణయ్య. రేపు ఉదయం 11 గంటలకు ఆర్ కృష్ణయ్య, బీద మస్తాన్‌రావు నామినేషన్‌ వేయనున్నారు. అటు కూటమి తరపున మూడో అభ్యర్థి విషయంలో ఇంకా సస్పెన్స్‌ కొనసాగుతోంది. సానా సతీష్‌తో పాటు పలువురి పేర్లు పరిశీలినలో ఉన్నట్టు తెలుస్తోంది. సానా సతీష్‌ విషయంలో కూటమి పార్టీల ఏకాభిప్రాయ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే హైదరాబాద్‌లో ఏపీ సీఎం చంద్రబాబును ఆశావహులు కలుస్తుండటం గమనార్హం.

About Kadam

Check Also

ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్ ప్రవేశాల గడువు పెంపు.. ఎప్పటి వరకంటే?

2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్‌ ప్రవేశాల గడువు జూన్‌ 30వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *