తెలంగాణ బీజేపీ చీఫ్ గా రామచందర్‌రావు బాధ్యతలు స్వీకరించారు. నాంపల్లిలోని పార్టీ ఆఫీసులో బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ డీకే ఆరుణ, బీజేపీ MLAలు హాజరయ్యారు. అంతకముందు చార్మినార్ దగ్గరున్న భాగ్యలక్ష్మి ఆలయానికి వళ్లి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు రామచందర్‌రావు. వెంటనే అమరవీరుల స్థూపం దగ్గరకు వెళ్లి నివాళులు అర్పించారు. అనంతరం నాంపల్లిలోని పార్టీ ఆఫీసుకు ర్యాలీగా వచ్చారు.
