రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా స్టార్ స్పిన్నర్.. గబ్బాలో షాకింగ్ నిర్ణయం..

Ashwin retirement: ఆఫ్ స్పిన్నర్ ఆర్ అశ్విన్ గబ్బా టెస్టు ముగిసిన వెంటనే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 38 ఏళ్ల అశ్విన్ తన అంతర్జాతీయ కెరీర్‌లో 765 వికెట్లు పడగొట్టాడు. అలాగే, టెస్టు క్రికెట్‌లో 6 సెంచరీల సాయంతో 3503 పరుగులు చేశాడు.

టీమిండియా స్టార్ స్పిన్నర్ ఆర్ అశ్విన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గబ్బాలో మూడో టెస్ట్ చివరి రోజున తన రిటైర్మెంట్ ప్రకటించాడు. కాగా, గాబ్బా టెస్టులో అశ్విన్‌కు చోటు దక్కలేదు. భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మూడో టెస్టు డ్రాగా ముగిసింది. బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానంలో జరిగిన మ్యాచ్‌లో చివరి రోజైన బుధవారం కేవలం 25 ఓవర్లు మాత్రమే వేయగలిగారు. ఆస్ట్రేలియా భారత్‌కు 275 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది, అయితే వర్షం కారణంగా ఒక రోజు ఆట రద్దు చేశారు.

About Kadam

Check Also

పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన ఆగ్రదేశాధి నేతలు.. ట్రంప్, పుతిన్‌ సహా పలువురి స్పందన ఇదే

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్ర దాడి యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. పుల్వామా దాడి తర్వాత జమ్ముకశ్మీర్‌ లోయలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *