ఇప్పుడు ఏటీఎంలలో ఎక్కువగా 500 రూపాయల నోట్లు కాకుండా 100,200 రూపాయల నోట్లే ఎక్కువగా వస్తున్నాయి. ఇది వరకు పెద్ద నోట్లు ఎక్కువగా వచ్చేవి. దీంతో సామాన్యులకు ఈ 500 నోట్లతో ఇబ్బందులు పడేవారు. కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా..
భారత కరెన్సీల విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. దేశంలోని 73 శాతం ఏటీఎంలలో100-200 రూపాయల నోట్లు ఉంటున్నాయి. సామాన్య ప్రజల సమస్యలను తెలుసుకున్న తర్వాత భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఏటీఎంల నుండి 100, 200 రూపాయల నోట్ల సంఖ్యను పెంచడానికి 2025 సెప్టెంబర్ 30న మార్గదర్శకాన్ని ఇచ్చింది. దేశంలోని ఏటీఎంలలో 75 శాతం వరకు 100, 200 రూపాయల నోట్లను ఉంచాలని ఆర్బీఐ బ్యాంకులకు సూచింది. అయితే ఇది వరకు ఏటీఎంలలో ఎక్కువగా 500 రూపాయల నోట్లు వచ్చేవి. ఇప్పుడు ఆర్డీఐ ఆదేశాల తర్వాత ఎక్కువ శాతం 100,200 రూపాయల నోట్లు ఉంటున్నాయి. 500 రూపాయల నోట్ల సంఖ్య భారీగా తగ్గిపోయింది.
దేశంలోని 215,000 ఏటీఎంలలో 73,000 నిర్వహిస్తున్న భారతదేశపు అతిపెద్ద నగదు నిర్వహణ సంస్థ అయిన CMS ఇన్ఫో సిస్టమ్స్ ప్రకారం, ఇది డిసెంబర్ 2024లో 65 శాతం పెరుగుదలను సూచిస్తుంది.