రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బాంబు బెదిరింపు.. పేల్చేస్తామంటూ రష్యన్ భాషలో మెయిల్..!

ఆర్బీఐను పేల్చేస్తామంటూ బెదిరింపు మెయిల్‌ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు విచారణ చేపట్టారు. నెల రోజు వ్యవధిలో ఆర్బీఐకి బెదిరింపులు రావడం ఇది రెండో సారి.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)కి బాంబు బెదిరింపు వచ్చింది. బ్యాంకును పేల్చివేస్తామంటూ బెదిరింపు మెయిల్ రావడంతో తీవ్ర కలకలం రేగింది. RBI అధికారిక వెబ్‌సైట్‌లో రష్యన్ భాషలో బెదిరింపులు వచ్చినట్లు ఒక ఇమెయిల్ వచ్చింది. ఆర్బీఐకి బెదిరింపుతో అప్రమత్తమైన పోలీసులు విచారణ చేపట్టారు. ఆర్బీఐని బాంబుతో పేల్చివేస్తామని మెయిల్‌లో పేర్కొన్నారు. ఘటనపై సమాచారం అందిన వెంటనే మాతా రమాబాయి మార్గ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ముంబై పోలీసులు తెలిపారు. నెల వ్యవధిలో ఇలాంటి సంఘటన జరగడం ఇది రెండోసారి.

గతంలో కూడా ఆర్బీఐకి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ ఏడాది నవంబర్‌లోనే ఆర్బీఐ కస్టమర్ కేర్ విభాగానికి బెదిరింపు కాల్ వచ్చింది. ఉదయం 10 గంటలకు కాల్ వచ్చింది. తాను లష్కరే తోయిబా సీఈఓ అని బ్యాంకును పేల్చేస్తామంటూ బెదిరించాడు.

ఈరోజు తెల్లవారుజామున, ఢిల్లీలోని 6 ప్రముఖ పాఠశాలలకు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. పాఠశాలలకు ఇమెయిల్ ద్వారా ఈ బెదిరింపు వచ్చింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అయితే అనుమానాస్పదంగా ఏమీ లభించలేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఢిల్లీలోని ఈస్ట్ ఆఫ్ కైలాష్ DPS, సల్వాన్ స్కూల్, మోడ్రన్ స్కూల్ మరియు కేంబ్రిడ్జ్ స్కూల్‌లకు ఇ-మెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. పోలీసులు నాలుగు పాఠశాలలకు చేరుకుని విచారణ ప్రారంభించారు.



About Kadam

Check Also

దేశంలో అత్యంత పొడవైన రైల్వే నెట్‌ వర్క్ ఈ రాష్ట్రానిదే..! భారతీయ రైల్వేలో రారాజు.. ఎన్ని వేల కిలో మీటర్లంటే..

ఇక్కడ 150 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల ఐదు ప్రాచీన రైల్వే స్టేషన్లు ఉన్నాయి. అవి బ్రిటిష్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *