ములుగు జిల్లాలో ఎస్సై రుద్రారపు హరీష్‌ ఆత్మహత్య కేసులో ట్విస్ట్‌

ములుగు జిల్లాలో ఎస్సై రుద్రారపు హరీష్‌ ఆత్మహత్యలో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. హరీష్ ఆత్మహత్య ఘటనలో యువతిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.  ఏడు నెలల కిందట హరీష్‌కు ఓ యువతి అనుకోకుండా ఫోన్ చేయగా, మాటామాటా కలిసి.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరూ చాట్ చేసుకునేవారు. హైదరాబాద్లో చదువుకునే ఆమె వారంలో రెండు రోజులు వాజేడుకు వచ్చి ఉండి వెళ్లేది.. కొంతకాలానికి యువతి బ్యాగ్రౌండ్ వెరిఫై చేయగా.. తను వేరే వాళ్లతో చనవుగా ఉన్నట్లు హరీష్ గుర్తించాడు. దీంతో తన ప్రవర్తన నచ్చక దూరంపెట్టాడు ఎస్సై. ఆపై వేరే యువతితో పెళ్లికి సిద్ధమైయ్యాడు. విషయం తెలుసుకున్న యువతి తనను పెళ్లి చేసుకోవాలని హరీష్‌ వెంటపడింది. దీనికి హరీశ్ ఒప్పుకోకపోవడంతో ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చెబుతాననంటూ బెదిరించింది. అధికారులకు తెలిస్తే పరువుపోతుందని మనస్తాపంతో హరీష్ సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తమ కుమారుడి మృతికి ఆ యువతే కారణమంటూ హరీశ్ తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో, ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

డిసెంబర్ 2వ తేదీ ములుగు జిల్లాలోని ముళ్లకట్ట సమీపంలోని ఓ రిసార్ట్స్‌లో తన సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని వాజేడ్ ఎస్ఐ హరీశ్ బలవన్మరణానికి పాల్పడ్డారు. వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తొలుత ప్రచారం జరిగింది.  ఏటూరు నాగారంలో ఎన్‌కౌంటర్‌ జరిగిన రాత్రే ఆయన సూసైడ్‌ చేసుకోవడంతో పలు అనుమానాలకు దారి తీసింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఉన్నత అధికారులు విచారణ చేసి అసలు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.

About Kadam

Check Also

అల్పపీడనం అలెర్ట్.. తెలంగాణకు అతిభారీ రెయిన్ అలెర్ట్.. ముఖ్యంగా ఈ జిల్లాలకు

బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ప్రసరణ మరియు ద్రోణి కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తాయి.. దీని ప్రభావం గుంటూరు, బాపట్ల, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *