ఫిబ్రవరి 1 నుంచి ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపు.. ఎక్కడెక్కడ ఎంతంటే.?

ఆంధ్రప్రదేశ్‌లో చాలా ప్రాంతాల్లో భూమి విలువ కంటే రిజిస్ట్రేషన్ విలువలో వ్యత్యాసాలు ఉన్నట్టు కూటమి ప్రభుత్వం గుర్తించింది. వీటిని సరిచేయాలని నిర్ణయించింది. మార్పుల కారణంగా భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంచబోతున్నట్టు స్పష్టం చేశారు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌. రిజిస్ట్రేషన్‌ బుక్ విలువ పెంచి రిజిస్ట్రేషన్‌ రేట్లు నిర్ణయిస్తామన్నారు.

గ్రోత్ కారిడార్లు, భూముల విలువ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో 20శాతం రిజిస్ట్రేషన్‌ చార్జీలు పెరుగుతాయన్నారు మంత్రి అనగాని. గత వైసీపీ పాలనలో రిజిస్ట్రేషన్‌ విలువల సవరణలో శాస్త్రీయ విధానాన్ని అనుసరించలేదన్నారు. కొన్ని చోట్ల రిజిస్ట్రేషన్ విలువ ఇష్టానుసారంగా పెంచారని.. ఆ విలువల్ని తగ్గిస్తామన్నారు. అసంబద్ధంగా జరిగిన రిజిస్ట్రేషన్ విలువల మార్పులో శాస్త్రీయ కోణంలో సవరిస్తున్నామన్నారు సత్యప్రసాద్‌. చరిత్రలో మొదటిసారిగా కొన్ని ప్రాంతాల్లో భూముల రిజిస్ట్రేషన్‌ విలువను తగ్గించబోతున్నామన్నారు. అయితే.. అమరావతి పరిసర గ్రామాల్లో చార్జీల పెంపు ఉండబోదని క్లారిటీ ఇచ్చారు. ప్రధానంగా విశాఖ, రాయలసీమ ప్రాంతాల్లో ఎక్కువగా రిజిస్ట్రేషన్‌ చార్జీలు పెరిగే ఛాన్స్ ఉంది.

About Kadam

Check Also

ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. ఆ పేపర్లపై హాల్‌టికెట్లు ప్రింట్‌ తీస్తే అనుమతి రద్దు: ఇంటర్‌ బోర్డు

రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు మార్చి 1 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే కొందరు విద్యార్ధులు ఫోన్‌కే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *