ఈపీఎఫ్‌వో కీలక ప్రకటన.. ఈసారి వడ్డీ రేటు ఎంతో తెలుసా?

EPFO: 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) డిపాజిట్లపై వడ్డీ రేటును ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నిర్దారించింది. ఈపీఎఫ్‌ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) సమావేశంలో ఈ వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం తీసుకుంది..

దేశంలోని 7.6 కోట్ల EPFO​ ​సభ్యులపై కీలక ప్రకటన వెలువడింది. 2024-25 సంవత్సరానికి ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPF) పై వడ్డీ రేటు 8.25%గా నిర్ణయించింది. శుక్రవారం జరిగిన ఈపీఎఫ్‌వో​ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ 8.25 శాతం వడ్డీరేటు యధావిధిగా కొనసాగించాలని నిర్ణయించారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం పొందిన తర్వాత.. ఈ వడ్డీ రేటు ఏడు కోట్లకు పైగా చందాదారులకు జమ అవుతుంది. ఫిబ్రవరి 2024లో ఈపీఎఫ్‌వో ​​2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్‌పై వడ్డీ రేటును 8.15 శాతం నుండి 2023-24 ఆర్థిక సంవత్సరానికి 8.25 శాతానికి స్వల్పంగా పెంచింది. మార్చి 2022లో ఈపీఎఫ్‌వో​తన 7 కోట్లకు పైగా సభ్యులకు EPFపై వడ్డీ రేటును 2021-22 ఆర్థిక సంవత్సరానికి 4 దశాబ్దాల కనిష్ట స్థాయి 8.1 శాతానికి తగ్గించింది. ఇది 2020-21 ఆర్థిక సంవత్సరంలో 8.5 శాతంగా ఉంది.

2020-21 సంవత్సరానికి ఈపీఎఫ్‌ వడ్డీ రేటు 8.10 శాతం

2020-21 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్‌ పై వడ్డీ రేటు 8.10 శాతంగా ఉంది. 1977-78లో ఈపీఎఫ్ వడ్డీ రేటు 8 శాతంగా ఉన్నప్పటి నుండి ఇది అత్యల్పం. అయితే ఈపీఎఫ్‌వో అత్యున్నత నిర్ణయం తీసుకునే సంస్థ అయిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) శుక్రవారం జరిగిన సమావేశంలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్‌ పై 8.25 శాతం వడ్డీని ఇవ్వాలని నిర్ణయించిందని నివేదిక తెలిపింది.

ప్రభుత్వం ఆమోదం పొందిన తర్వాత వడ్డీ డబ్బు ఖాతాలోకి..

2020-21 ఆర్థిక సంవత్సరానికి EPF డిపాజిట్లపై 8.5 శాతం వడ్డీ రేటును CBT మార్చి 2021లో నిర్ణయించింది. CBT నిర్ణయం తర్వాత 2024-25 సంవత్సరానికి ఈపీఎఫ్‌ డిపాజిట్లపై వడ్డీ రేటు ఆమోదం కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపింది. ప్రభుత్వం ఆమోదం పొందిన తర్వాత 2024-25 సంవత్సరానికి ఈపీఎఫ్‌పై వడ్డీ రేటు ఈపీఎఫ్‌లోని ఏడు కోట్లకు పైగా సభ్యుల ఖాతాలకు జమ అవుతుంది. ప్రభుత్వం ఆర్థిక మంత్రిత్వ శాఖ ద్వారా ఆమోదం పొందిన తర్వాతే ఈపీఎఫ్‌వో​వడ్డీ రేటును అందిస్తుంది.

డిసెంబర్ 2024లో ఈపీఎఫ్‌వోలో 16.05 లక్షల మంది కొత్త సభ్యులు:

ఇదిలా ఉండగా, ఈపీఎఫ్‌వోలో కొత్త సభ్యుల చేరిక నెలనెల పెరుగుతోంది. డిసెంబర్ 2024లో ​నికరంగా 16.05 లక్షల మంది కొత్త సభ్యులను చేర్చుకున్నట్లు ఈపీఎఫ్‌వో తెలిపింది. నవంబర్ 2024 తో పోలిస్తే ఇది 9.69 శాతం ఎక్కువ. ఈ సమాచారం రెగ్యులర్ జీతం పొందుతున్న ఉద్యోగులకు సంబంధించిన ఈపీఎఫ్‌వో​డేటా నుండి పొందింది. డిసెంబర్ 2023తో పోలిస్తే రెగ్యులర్ జీతం పొందుతున్న వారి సంఖ్య 2.74 శాతం ఎక్కువగా ఉందని కార్మిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

గత పదేళ్లలో ఈపీఎఫ్‌ వడ్డీ రేట్లు:

  • 2014-15: 8.75 శాతం
  • 2015-16: 8.8 శాతం
  • 2016-17: 8.65 శాతం
  • 2017-18: 8.55 శాతం
  • 2018-19: 8.65 శాతం
  • 2019-20: 8.5 శాతం
  • 2020-21: 8.5 శాతం
  • 2021-22: 8.1 శాతం
  • 2022-23: 8.15 శాతం
  • 2023-24: 8.25 శాతం

About Kadam

Check Also

తీగలాగితే డొంక కదులుతోంది.. ఇకపై ఆటలు సాగవంటున్న సైబర్ పోలీసులు!

సైబర్ క్రైమ్.. ఇప్పుడు ప్రపంచం ముందున్న అతిపెద్ద సవాల్ ఇదే. టెక్నాలజీ పెరుగుతున్నట్లుగానే సైబర్ కేటుగాళ్లు సైతం అదే స్థాయిలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *