అక్కను చంపే ముందు రీల్స్ చేసిన రోహిత్‌… షాద్‌నగర్ పరువు హత్య కేసులో సంచలన విషయాలు

ఫేమస్‌ అవ్వాలంటే హత్యలు కూడా చేస్తారా? అది కూడా సొంత వాళ్లకు చంపేందుకు కూడా వెనుకాడరా? షాద్‌నగర్‌ హత్య కేసులో ఇప్పుడే ఇదే విషయం సంచలనం రేపుతోంది. షాద్‌నగర్ పరువు హత్య కేసులో పక్కా ప్లాన్ ప్రకారమే అక్కను ఆమె తమ్ముడు రోహిత్‌ హత్య చేసినట్టు తెలుస్తోంది. అక్కను చంపే ముందు రీల్స్ చేశాడు రోహిత్‌. ఫేమస్ అవ్వాలి మామ, బాగా బతికి పేరు తెచ్చుకునే ఓపిక లేదు… బాగా చంపి ఫేమస్ అయ్యేదా అంటూ రీల్స్ చేశాడు. దీంతో హత్య చేసేందుకు ముందుగానే రోహిత్‌ ప్లాన్‌ చేసినట్టు తెలుస్తోంది.

అక్క రుచిత వేరే వ్యక్తితో ఫోన్ మాట్లాడుతుందని రుచిత గొంతుకు వైర్ బిగించి హత్య చేశాడు రోహిత్. ఛార్జింగ్ వైర్‌ మెడకు బిగించి చంపేశాడు. హత్య తర్వాత తనకు ఏమీ తెలియనట్లు స్పృహ తప్పి పడిపోయిందని బంధువులకు ఫోన్ చేశాడు రోహిత్.. విషయం తెలుసుకుని తండ్రి నిలదీయడంతో తానే హత్య చేసినట్టు రోహిత్ ఒప్పుకున్నాడు.

ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు తెలిపారు. ప్రేమ వ్యవహారంపై ఇంట్లో తరచూ గొడవలు జరిగినట్లు తమకు సమాచారం ఉందన్నారు. వేరే యువకుడితో మాట్లాడొద్దని గతంలో అక్క రుచితను రోహిత్ చాలాసార్లు వారించినట్లు తెలుస్తోంది.

About Kadam

Check Also

ఆ కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..

తెలంగాణలో వరద బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే.. దీంతో పలు జిల్లాల్లో అపారనష్టం జరిగింది. ఇళ్లు, పంటలు నీటమునిగాయి.. ఇప్పుడిప్పుడే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *