రైల్వే జోన్లలో ఆర్‌ఆర్‌బీ (ఎన్‌టీపీసీ) నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ అండర్ గ్రాడ్యుయేట్ (CEN 06/2024) పోస్టుల భర్తీకి సంబంధించిన రాత పరీక్షలు ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు తాజాగా విడుదల చేసింది…
దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే జోన్లలో ఆర్‌ఆర్‌బీ (ఎన్‌టీపీసీ) నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ అండర్ గ్రాడ్యుయేట్ (CEN 06/2024) పోస్టుల భర్తీకి సంబంధించిన రాత పరీక్షలు ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు తాజాగా విడుదల చేసింది. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ నుంచి ఆన్సర్ కీతోపాటు పరీక్ష ప్రశ్నపత్రం, రెస్పాన్స్‌షీట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆన్సర్ కీ పై అభ్యంతరాలకు లేవనెత్తడానికి సెప్టెంబర్ 20వ తేదీ వరకు అవకాశం కల్పించింది. కాగా మొత్తం 11,558 రైల్వే పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే.
ఈ పోస్టులను ఆన్‌లైన్ రాత పరీక్షలు దేశ వ్యాప్తంగా ఆగస్టు 7వ తేదీ నుంచి సెప్టెంబరు 9వ తేదీ వరకు జరిగాయి. ఇందులో అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు 3,445, గ్రాడ్యుయేట్ పోస్టులు 8,113 వరకు ఉన్నాయి. అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు 3,445 ఉండగా.. మొత్తం ఖాళీల్లో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ పోస్టులు 2022, అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు 361, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు 990, ట్రైన్స్ క్లర్క్ పోస్టులు 72 వరకు ఉన్నాయి. ప్రాథమిక ఆన్సర్ కీపై అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత తుది ఆన్సర్ కీ సిద్ధం చేసి, ఆ వెనువెంటనే ఫలితాలు కూడా వెల్లడించనున్నారు.
RRB NTPC UG ఆన్సర్ కీ 2025 డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలాగంటే..
- ముందుగా RRB అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
- హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న RRB NTPC UG ఆన్సర్ కీ 2025 లింక్‌పై క్లిక్ చేయాలి.
- అభ్యర్థులు లాగిన్ వివరాలను నమోదు చేయాల్సిన కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
- వివరాలు నమోదు చేసి సబ్‌మిట్‌పై క్లిక్ చేయాలి.
- వెంటనే స్ర్కీన్‌పై ఆన్సర్ కీతోపాటు రెస్పాన్స్‌షీట్, క్వశ్చన్ పేపర్ కనిపిస్తాయి.
- వీటిని డౌన్‌లోడ్ చేసుకుని తదుపరి అవసరం కోసం ప్రింటవుట్ తీసుకుని భద్రపరచుకోవాలి.