కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఆర్‌ఆర్‌బీ గ్రూప్ డి పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం ఆన్‌లైన్ విధానంలో కంప్యూటర్ ఆధారిత పరీక్షలను మరో..
కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని రైల్వే మంత్రిత్వ శాఖ ఆర్‌ఆర్‌బీ గ్రూప్ డి పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం ఆన్‌లైన్ విధానంలో కంప్యూటర్ ఆధారిత పరీక్షలను నవంబర్ 17 నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు నిర్వహించనుంది. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్‌ను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ నోటిఫికేషన్ కింద దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లలో మొత్తం 32,438 గ్రూప్ డి లెవల్ 1 పోస్టులను భర్తీ చేయనుంది.
కాగా ఇప్పటికే ఈ పోస్టులకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ పూర్తయ్యింది. ఆర్‌ఆర్‌బీ ఎగ్జామ్ తేదీకి వారం రోజుల ముందుగా సిటీ ఇంటిమేషన్ స్లిప్‌లను విడుదల చేయనుంది. ఇక పరీక్షకు నాలుగు రోజుల ముందు అడ్మిట్ కార్డులను అందుబాటులోకి తీసుకురానుంది. అభ్యర్ధులు తమ వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవాలని ఆర్‌ఆర్‌బీ సూచించింది.