దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే జోన్లలో సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ RRB నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 368 పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఎవరైనా సెప్టెంబర్ 15 నుంచి ఆన్‌లైన్ విధానంలో..
భారత రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే జోన్లలో సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 368 పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఎవరైనా సెప్టెంబర్ 15 నుంచి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకే దఫాలో నిర్వహించే రాత పరీక్ష ద్వారా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి..
రీజియన్ల వారీగా ఆర్‌ఆర్‌బీ ఖాళీల వివరాలు ఇలా..
- అహ్మదాబాద్ జోన్‌లో పోస్టుల సంఖ్య: 15
- అజ్‌మేర్ జోన్‌లో పోస్టుల సంఖ్య: 33
- బెంగళూరు జోన్‌లో పోస్టుల సంఖ్య: 24
- భోపాల్ జోన్‌లో పోస్టుల సంఖ్య: 6
- భువనేశ్వర్ జోన్‌లో పోస్టుల సంఖ్య: 17
- బిలాస్‌పూర్ జోన్‌లో పోస్టుల సంఖ్య: 27
- చండీగఢ్ జోన్‌లో పోస్టుల సంఖ్య: 7
- చెన్నై జోన్‌లో పోస్టుల సంఖ్య: 5
- గువాహటి జోన్‌లో పోస్టుల సంఖ్య: 16
- జమ్ము అండ్ శ్రీనగర్ జోన్‌లో పోస్టుల సంఖ్య: 10
- కోల్‌కతా జోన్‌లో పోస్టుల సంఖ్య: 28
- మాల్దా జోన్‌లో పోస్టుల సంఖ్య: 14
- ముంబయి జోన్‌లో పోస్టుల సంఖ్య: 44
- ముజఫర్‌పూర్ జోన్‌లో పోస్టుల సంఖ్య: 21
- పట్నా జోన్‌లో పోస్టుల సంఖ్య: 5
- ప్రయాగ్‌రాజ్ జోన్‌లో పోస్టుల సంఖ్య: 23
- రాంచీ జోన్‌లో పోస్టుల సంఖ్య: 15
- సికింద్రాబాద్ జోన్‌లో పోస్టుల సంఖ్య: 25
- సిలిగురి జోన్‌లో పోస్టుల సంఖ్య: 5
- గోరఖ్‌పూర్ జోన్‌లో పోస్టుల సంఖ్య: 9
- తిరువనంతపురం జోన్‌లో పోస్టుల సంఖ్య: 19
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి తప్పనిసరిగా 20 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో అక్టోబర్ 14, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులు రూ.500, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ట్రాన్స్‌జెండర్, ఎక్స్‌సర్వీస్‌మెన్, దివ్యాంగ అభ్యర్థులు రూ.250 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఆన్‌లైన్ రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.35,400 నుంచి ప్రారంభవేతనం ఉంటుంది.
ముఖ్య తేదీలు ఇవే..
దరఖాస్తు సవరణ తేదీలు: అక్టోబర్ 17 నుంచి 26 వరకు
ఆన్‌లైన్ దరఖాస్తులకు ప్రారంభ తేదీ: సెప్టెంబర్ 15, 2025.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 14, 2025.
దరఖాస్తు ఫీజు చెల్లింపులకు చివరి తేదీ: అక్టోబర్ 16, 2025.