నిరుద్యోగులకు భారీ శుభవార్త.. రైల్వేలో 50 వేల ఉద్యోగాలకు త్వరలో వరుస నోటిఫికేషన్లు!

నిరుద్యోగులకు రైల్వే శాఖ భారీ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే వరుస నోటిఫికేషన్లు విడుదల చేసిన రైల్వేశాఖ.. 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 50 వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది మొదటి 3 నెలల్లో ఇప్పటికే 9వేలకు పైగా నియామకాలకు నోటిఫికేషన్లు జారీ చేసింది. త్వరలోనే మిగితా ఉద్యోగాల భర్తీకి కూడా నోటిఫికేషన్లు విడుదల చేస్తామని వెల్లడించింది. ఈ ఏడాదికి మొత్తం 55,197 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. వచ్చే ఏడాదికి అంటే 2026-27 ఆర్ధిక సంవత్సరానికి కూడా మరో 50 వేల రైల్వే పోస్టులను భర్తీ చేస్తామని తెలిపింది.

రైల్వే రిక్రూట్‎మెంట్ బోర్డు (ఆర్ఆర్‎బీ) ద్వారా ఈ పోస్టులన్నీ భర్తీ చేస్తామని తెలిపింది. అన్ని నియామక పరీక్షలు (సీబీటీ) విధానంలో నిర్వహిస్తామని తెలిపింది. టెక్నికల్, నాన్-టెక్నికల్, మినిస్టీరియల్, లెవల్-1, ఇతర విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఇటీవల అభ్యర్థుల గుర్తింపును ప్రామాణీకరించడానికి ఇటీవల E-KYC ఆధారిత ఆధార్ ప్రామాణీకరణను తప్పనిసరి చేసింది. ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా మోసాలకు పాల్పడే అవకాశాన్ని తొలగించడానికి RRBల అన్ని పరీక్షా కేంద్రాలలో ఇప్పుడు జామర్‌లను 100 శాతం మోహరిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.

నిజానికి, RRB పరీక్షలకు CBTలు నిర్వహించడం చాలా ప్రణాళిక, సమన్వయంకు భారీ కసరత్తు చేయవల్సి ఉంటుంది. RRBలు ఇటీవల అభ్యర్థుల నివాస స్థలాలకు దగ్గరగా పరీక్షా కేంద్రాలను కేటాయించడానికి చొరవ తీసుకున్నాయి. ఇందులో మహిళలు, PwBD అభ్యర్థులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందుకోసం మరిన్ని పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. త్వరలో విడుదల చేయబోయే రైల్వే పోస్టులకు ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఇంజనీరింగ్ పాస్ అయిన అభ్యర్థులు అర్హులు. అభ్యర్థులు తమ ప్రాంతంలోని ఖాళీల వివరాలు నోటిఫికేషన్లలో తనిఖీ చేసుకున్న తర్వాతే అధికారిక ఆర్ఆర్‎బీ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఉద్యోగాల వివరాలు, అర్హతలు, వేతనం, వయోపరిమితి వంటి వివరాలను నోటిషికేషన్‌లో తెలియజేస్తామని ఆర్ఆర్‌బీ తెలిపింది.

About Kadam

Check Also

దేశంలోని ప్రతి మూలలో మోహరించనున్న ‘బ్రహ్మాస్త్ర’.. త్వరలో రాబోతున్న S-400 కొత్త బ్యాచ్‌!

భారతదేశ S-400 రక్షణ వ్యవస్థ శక్తిని ప్రపంచం అంగీకరించింది. పాకిస్తాన్ ఇప్పటికే దానిని రుచి చూసింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *