రైల్వే రిక్రూట్ మెంట్ సెల్ (RRC).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 904 అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేస్తారు. ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, కార్పెంటర్, పెయింటర్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 13వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు..
కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన సౌత్ వెస్టర్న్ రైల్వే (SWR).. హుబ్బళ్లి, మైసూరు, బెంగళూరు డివిజన్లలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్ మెంట్ సెల్ (RRC) దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 904 అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేస్తారు. ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, కార్పెంటర్, పెయింటర్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 13వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. పదో తరగతి, ఇంటర్ అర్హత కలిగిన అభ్యర్ధులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోవచ్చు.
పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ లేదా బోర్డు నుంచి ఇంటర్, పదో తరగతితోపాటు ఐటీఐలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి 2025 ఆగస్టు 13వ తేదీ నాటికి తప్పనిసరిగా 15 నుంచి 24 ఏళ్లలోపు ఉండాలి. ఈ అర్హతలు కలిగిన వారు ఎవరైనా ఆన్‌లైన్‌లో ఆగస్టు 13, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద ప్రతి ఒక్కరూ రూ.100 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్ధులు ఎలాంటి ఫీజు చెల్లించనవసరం లేదు. ఎలాంటి రాత పరీక్షలేకుండానే విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి ఏడాది పాటు శిక్షణ అందిస్తారు. స్టైపెండ్‌తోపాటు ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పిస్తారు.