సంక్రాంతికి ఊరెళ్లేవారికి అద్దిరిపోయే శుభవార్త.. ఇది కదా కావాల్సింది

సంక్రాంతి పండుగ అంటే ఎలా ఉంటుందో తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనికోసం సొంత గ్రామాలకు వెళ్లేందుకు అందరూ సిద్ధం అవుతారు. ముఖ్యంగా సంక్రాంతి సీజన్‌లో హైదరాబాద్ మహానగరం సగానికిపైగా ఖాళీ అయిపోతుంది. మరి దీనికోసం ఏపీఎస్ఆర్టీసీ ఏయే ప్రణాళికలు చేసిందంటే..

ఏపీఎస్ఆర్టీసీ సంక్రాంతి పండుగకు సొంతూరు వెళ్లేవారి కోసం తీపికబురు చెప్పింది. సంక్రాంతి పండుగ అంటే ఎలా ఉంటుందో తెలుగు ప్రజలకు చెప్పనక్కర్లేదు. ఇందుకోసం సొంతూళ్లకు వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటారు. ఇప్పటికే చాలామంది టికెట్లు బుక్ చేసుకున్నారు. అందులోనూ హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చేవారి సంఖ్య అత్యధికంగా ఉంటుంది. అలాంటి వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. సంక్రాంతి పండుగ ప్రయాణాలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లేవారి కోసం ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఏపీఎస్ఆర్టీసీ రెడీ అయింది. 2,400 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు.

జనవరి 9 నుంచి 13వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ తెలిపింది. రెగ్యులర్ బస్సులకు ఇవి అదనమని.. ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలు లేవని రెగ్యులర్ ఛార్జీలే ఉంటాయని ఏపీఎస్ఆర్టీసీ స్పష్టం చేసింది. హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్‌లో రద్దీని తగ్గించేందుకు జనవరి 10 నుంచి 12 వరకు కొన్ని మార్పులు చేయనున్నట్లు పేర్కొంది. చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు, కర్నూలు, అనంతపురం, మాచర్ల వైపు వెళ్లే రెగ్యులర్, స్పెషల్ బస్సుల్ని ఎంజీబీఎస్‌కు ఎదురుగా ఉన్న పాత సీబీఎస్, గౌలిగోడ నుంచి నడిపించనున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏపీఎస్ఆర్టీసీ వెల్లడించింది.

About Kadam

Check Also

ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. ఆ పేపర్లపై హాల్‌టికెట్లు ప్రింట్‌ తీస్తే అనుమతి రద్దు: ఇంటర్‌ బోర్డు

రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు మార్చి 1 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే కొందరు విద్యార్ధులు ఫోన్‌కే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *