ఎలాంటి రాత పరీక్షలేకుండానే.. ఎస్‌బీఐ బ్యాంకులో ఉద్యోగాలు! నెలకు రూ.లక్షకుపైగా జీతం

దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ SBI బ్రాంచుల్లో రెగ్యులర్‌ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 122 మేనేజర్‌(క్రెడిట్‌ అనలిస్ట్‌), మేనేజర్‌(ప్రొడక్ట్స్‌-డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌), డిప్యూటీ మేనేజర్‌..

స్టేట్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI).. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ బ్రాంచుల్లో రెగ్యులర్‌ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 122 మేనేజర్‌(క్రెడిట్‌ అనలిస్ట్‌), మేనేజర్‌(ప్రొడక్ట్స్‌-డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌), డిప్యూటీ మేనేజర్‌ (ప్రొడక్ట్స్‌-డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌) పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్‌ 11వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

పోస్టుల వివరాలు ఇవే..

  • మేనేజర్‌(క్రెడిట్‌ అనలిస్ట్‌) పోస్టుల సంఖ్య: 63
  • మేనేజర్‌(ప్రొడక్ట్స్‌-డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌) పోస్టుల సంఖ్య: 34
  • డిప్యూటీ మేనేజర్‌ (ప్రొడక్ట్స్‌-డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌) పోస్టుల సంఖ్య: 25

పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా ఎంబీఏ, పీజీడీబీఏ, పీజీడీబీఎం, ఎంఎంఎస్‌, సీఏ, సీఎఫ్‌ఏ, ఐసీడబ్ల్యూఏ లేదా బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి మేనేజర్‌ పోస్టులకు 28 నుంచి 35 ఏళ్లు, డిప్యూటీ మేనేజర్‌ పోస్టులకు 25 నుంచి 32 ఏళ్లు, మేనేజర్‌ (క్రెడిట్‌ అనలిస్ట్‌) పోస్టులకు 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో అక్టోబర్ 2, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు కింద జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.750 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఇక ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించనవసరం లేదు. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే. విద్యార్హతలు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు మేనేజర్‌ పోస్టులకు రూ.85,920 నుంచి రూ.1,05,280 వరకు, డిప్యూటీ మేనేజర్‌ పోస్టులకు రూ.64,820 నుంచి రూ.93,960 వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు ఈ కింది నోటిఫికేషన్‌ లింక్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

About Kadam

Check Also

నిరుద్యోగులకు భలే న్యూస్.. ఆర్టీసీలో డ్రైవర్, కండక్టర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ వచ్చేసిందోచ్‌!

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎట్టకేలకు నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఎప్పుడాని ఊరిస్తున్న ఆర్టీసీ ఉద్యోగాలకు మోక్షం కలిగిస్తూ ఉద్యోగ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *