నకిలీ స్కీములతో జర జాగ్రత్త.. ఆ ప్రకటనలపై ప్రజలకు ఎస్బీఐ హెచ్చరిక

బ్యాంక్ మేనేజ్మెంట్ డీప్ ఫేక్ వీడియోలతో సోషల్ మీడియాలో ప్రచారం అవుతోన్న వివిధ స్కీముల ప్రకటనలపై ఎస్పీఐ స్పందించింది. ఇలాంటి ఫేక్ వీడియోలను నమ్మి ప్రజలు మోసపోవద్దని సూచించింది. ఇలాంటి ప్రకటనలను ఎస్బీఐ ఎప్పుడూ చేయదని స్పష్టం చేసింది. ఈ మేరకు కీలక ప్రకటనను విడుదల చేసింది..

దేశంలో రోజురోజుకూ ఆన్లైన్​ మోసాలు వేగంగా పెరిగిపోతున్నాయి. కొత్త టెక్నాలజీని ఉపయోగించి ప్రజలను మోసగిస్తున్నారు. బ్యాంకుల పేర్లు చెప్పుకుని లేదా డిజిటల్​ అరెస్టులంటూ అమాయకుల నుంచి లక్షల రూపాయలు కొట్టేస్తున్నారు. కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్​ (ఏఐ) పెరుగుతున్నందున ఆన్​లైన్​ మోసగాళ్లు ప్రజలను మోసం చేయడానికి డీప్​ ఫేక్​ వీడియోలు, ఏఐ ఆధారిత వాయిస్​ క్లోనింగ్​, సోషల్​ మీడియా యాప్​లను ఉపయోగిస్తుండటం ఆందోళనకరంగా మారింది. ప్రముఖులు సైతం ఈ మోసాల బారిన పడుతున్నారు. సచిన్​ తెందూల్కర్​, విరాట్​ కోహ్లీ, అమితాబ్​ బచ్చన్​, రష్మిక వంటి వారు కూడా డీప్​ ఫేక్​ల ద్వారా లక్ష్యంగా చేసుకోవడం గమనార్హం.

ఎస్బీఐ హెచ్చరిక

తాజాగా బ్యాంకు అధికారుల పేర్లతో వస్తోన్న వివిధ నకిలీ ప్రకటనలపై భారతీయ స్టేట్​ బ్యాంక్ (ఎస్బీఐ)​ స్పందించింది. ఎస్బీఐకి చెందిన ఉన్నతాధికారులు ఇన్వెస్ట్​మెంట్లపై వివిధ ప్రకటనలను ఇస్తున్నట్లు వస్తోన్న డీప్​ ఫేక్​ వీడియోలపై వినియోగదారులను ఆ బ్యాంకు అప్రమత్తం చేసింది. పెద్ద ఎత్తున్న రిటర్నులు వస్తాయంటూ ఎస్పీఐ మేనేజ్​మెంట్​ చెప్తున్నట్లు సోషల్​ మీడియాలో వస్తున్న వీడియోలు అన్ని ఫేక్​ అని స్పష్టం చేసింది. ‘ఎక్స్​’ వేదికగా ఈ మేరకు వివరణ ఇచ్చింది. ఎస్బీఐ ఇలాంటి ప్రకటనలు ఎప్పుడూ చేయదంటూ పేర్కొంది.  ఇలాంటి వాటిని చూసి మోసపోవద్దని స్పష్టం చేసింది.

ఇలాంటి ప్రచారాలు నమ్మొద్దు

“బ్యాంక్​ మేనేజ్​మెంట్​ అని చెప్పుకుంటూ వివిధ పథకాలను కొందరు డీప్​ వీడియోల ద్వారా ప్రచారం చేస్తున్నారు. వాళ్లు చెప్తున్న స్కీములకు సంబంధించి బ్యాంకుతో గానీ, అధికారులతో గానీ ఎలాంటి కనెక్షన్​ లేదు. వివిధ బ్యాంకు స్కీముల్లో పెట్టుబడులు పెట్టడంటూ కొంత మంది స్కామర్లు చేస్తున్న ప్రచారాన్ని అస్సలు నమ్మొద్దు. ఇలాంటి ఫేక్​, ఎక్కువ రాబడి వస్తుందంటూ ఎస్బీఐ ఎప్పుడూ హామీ ఇవ్వదు. ఇలాంటి ప్రకటనలను నమ్మి మోసపోకుండా వినియోగదారలు అప్రమత్తంగా ఉండాలి” అని ఎక్స్​లో ఎస్బీఐ పోస్ట్ చేసింది.

About Kadam

Check Also

ఉపాధి హామీలో ఇకపై అలా నడవదు.. రెండు సార్లు ఫొటో దిగితేనే కూలీలకు డబ్బులు..

ఉపాధి హామీ పథకం.. ఎంతో మంది నిరుపేద గ్రామస్థులకు ఈ పథకం ఒక వరం. గ్రామాల్లో సరిగ్గా పని లేనివారిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *