పాఠశాలలకు సెలవులు వస్తున్నాయంటే చాలు విద్యార్థులు ఎగిరి గంతేస్తారు. సెలవుల్లో ఎంజాయ్ చేయాలనే ఆనందంలో మునిగిపోతారు. అయితే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ రానున్నాయి. కానీ అంతకు ముందు అంటే ఏప్రిల్ నెలలో కూడా పాఠశాలలకు సెలవులు వస్తున్నాయి. ఇందులో పండగలు, ఇతర కార్యక్రమాల సందర్బంగా సెలవులు ఉన్నాయి. అవేంటో చూద్దాం..
- మార్చి 31వ తేదీ రంజాన్ పండుగ ఉంది. ఈ నేపథ్యంలో మరుసటి రోజు అంటే ఏప్రిల్ 1వ తేదీ కూడా పండుగ సెలవులు ఉంటుంది. దీంతో రంజాన్‌కు రెండు రోజులు సెలవులు రానున్నాయి.
- ఏప్రిల్ 6 ఆదివారం – ఈరోజు శ్రీరామనవమి. ఆలయాల్లో రాముల వారి పెళ్లి వైభవంగా జరుపుతారు. ఆ రోజున అన్ని విద్యాసంస్థలకు సెలవు ఉంటుంది.
- ఏప్రిల్ 10 గురువారం – మహావీర్ జయంతి. ఈ సందర్భంగా పాఠశాలలకు సెలవు ఉంటుంది.
- ఏప్రిల్ 13 ఆదివారం – ఈరోజు ‘బైశాఖి’ నిర్వహిస్తారు. అయితే ఆదివారం కాబట్టి అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఉంటుంది.
- ఏప్రిల్ 14 సోమవారం – డాక్టర్ బాబా సాహెబ్ భీమ్ రావు అంబేద్కర్ జయంతి. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని విద్యా సంస్థలకు సెలవు ఉంటుంది.
- ఏప్రిల్ 18 శుక్రవారం – ‘గుడ్ ఫ్రైడే’ ఇది ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తారు. ఈరోజు కూడా అన్ని పాఠశాలలు, కాలేజీలకు సెలవు ఉంటుంది. అంతేకాదు బ్యాంకులు సైతం మూసి ఉంటాయి. నెలలో అనేక రోజులు పాఠశాలలు, కళాశాలలకు సెలవులు రానున్నాయి. అయితే కొన్ని ప్రత్యేక రోజులు, పండుగలు రోజుల్లో మాత్రం ఆయా ప్రాంతాలను బట్టి సెలవులు ఉంటాయని గుర్తించుకోండి. ఇది ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధంగా అమలు చేస్తారు.