భారీ వర్షాల ఎఫెక్ట్‌.. 13 జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు! బయటకు రావొద్దంటూ హెచ్చరికలు జారీ

రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. కుండపోత వానలతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో నల్లగొండ, యాదాద్రి భువనగిరి, కరీంనగర్‌, సిద్దిపేట్ల, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో అన్ని విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. ఇప్పటికే కామారెడ్డి, మెదక్‌, నిర్మల్‌, ఆదిలాబాద్‌, కుమ్రం భీమ్‌ ఆసిఫాబాద్‌తోపాటు పలు జిల్లాల్లో..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. కుండపోత వానలతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో నల్లగొండ, యాదాద్రి భువనగిరి, కరీంనగర్‌, సిద్దిపేట్ల, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో అన్ని విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. ఇప్పటికే కామారెడ్డి, మెదక్‌, నిర్మల్‌, ఆదిలాబాద్‌, కుమ్రం భీమ్‌ ఆసిఫాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, జగిత్యాల జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ఇస్తున్నట్లు బుధవారం సర్కార్ ప్రకటించింది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 16 జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ఇచ్చారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో అత్యవసరమైతే తప్ప బయకు రావద్దంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

అయితే గురువారం సెలవు ప్రకటించిన నేపథ్యంలో ప్రతిగా వచ్చే నెల (సెప్టెంబర్‌) రెండో శనివారం స్కూల్స్‌ నడపాలని అధికారులు నిర్ణయించారు. భారీవర్షాల దృష్ట్యా పలు జిల్లాల్లో విద్యార్థులు స్కూళ్లకు వెళ్లిన తర్వాత అధికారులు సెలవు ప్రకటించారు. దీంతో విద్యార్థులు తడుచుకుంటూ ఇంటికెళ్లిపోయారు. ఆదిలాబాద్‌ జిల్లాలో నిన్న రాత్రి నుంచి ఏకధాటి వర్షం కురుస్తుండటంతో జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్‌ తీగలు సైతం తెగిపోయాయి. భీంపూర్‌, తాంసి మండలాల్లోని 50 గ్రామాలకు బుధవారం రాత్రి నుంచి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. భారీవర్షాలు, వరదల నేపథ్యంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. వరద ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, వరంగల్ నుంచి ఖమ్మం దాకా పలు జిల్లాల్లో వరదల రోడ్లు తెగిపోయి రవాణా వ్యవస్థ అతలాకుతలమైంది. మరో రెండు రోజులు భారీ వర్షాలు ఉండటంతో అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. అవసరమైతేతప్ప బయటకు రావొద్దంటూ సూచించారు.

About Kadam

Check Also

సంచలన నిర్ణయం.. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్‌.. సెప్టెంబర్‌లోనే స్థానిక సంస్థల ఎన్నికలు

తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *