అసలే వర్షాకాలం పాములు, క్రిమి, కీటకాలు సంచారం పెరిగే కాలం. పల్లెలు, పట్టణాలను తేడా లేదు. ముఖ్యంగా వర్షాకాలం లో పాములు బుసలు కొడుతుంటాయి.. పాము కనబడితేచాలు భయంతో పారిపోతుంటారు. జనావాసాలు ముఖ్యంగా పాత భవనాలు, హాస్టళ్లు, ఆస్పత్రుల పరిసరాల్లో ఈ విష ప్రాణుల సంచారం మనుషులకు ప్రమాదకరంగా మారుతున్నాయి. చెట్లు, పుట్టలు పేరుకుపోవడం, వ్యర్థాలు ఆస్పత్రి పరిసరాల్లో కుప్పలుగా పేరుకుపోవడంతో పాములు, ఎలుకలకు అవాసంగా మారాయి. ఎలుకల కోసం పాములు విచ్చలవిడిగా సంచరిస్తుంటాయి.
తాజాగా ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలోని శ్రీ బాల త్రిపురసుందరీ దేవి ఆలయం సమీపంలో ఉన్న ఆవుల కొట్టంలో ఏడు అడుగుల పొడవైన పాము ప్రత్యక్షమైంది. దాన్ని చూసిన ఫామ్ యజమాని కోటిరెడ్డి, వెంటనే స్నేక్ క్యాచర్ మల్లికార్జునకు సమాచారం ఇచ్చాడు. అక్కడకు వచ్చిన స్నేక్ క్యాచర్ 7అడుగుల భారీ పామును చాకచక్యంగా పట్టుకుని, సమీపంలోని అడవి ప్రాంతంలో వదిలేశాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. స్నేక్ క్యాచర్ మల్లికార్జున ను అభినందించారు.
Amaravati News Navyandhra First Digital News Portal