23 వ తేదీ ఆదివారం మాఘ బహుళ దశమి ముహూర్తాన ఉదయం 11 గంటలకు శ్రీ భవాని సహిత సిద్దేశ్వరస్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నారు.. ఈ నేపద్యంలో ఆలయాన్ని కళ్యాణ వేడుకకు పూర్తి స్థాయిలో సిద్ధం చేశారు. కల్యాణ మహోత్సవానికి ముందు ఆనవాయితీ ప్రకారం సిద్దేశ్వరన్నీ పెళ్లి కొడుకులా ముస్తాబు చేశారు.. స్వయంభు సిద్దేశ్వరస్వామి లింగం వద్ద స్వామి వారినీ అచ్చం పెళ్ళి కొడుకులా ముస్తాబు చేసిన అలంకరణ ను చూసి భక్తులు మురిసి పోతున్నారు..
దక్షిణ కాశీగా పేరుగాంచిన వరంగల్ లోని శ్రీ స్వయంభు సిద్దేశ్వరస్వామి ఆలయంలో భవాని సహిత సిద్దేశ్వర కళ్యాణ మహోత్సవానికి వేళయింది.. 23వ తేదీన జరిగే కళ్యాణ వేడుకలో భాగంగా ఆ పరమశివుని పెళ్ళికొడుకులా ముస్తాబు చేశారు…
కాకతీయులు ఏలిన గడ్డ వరంగల్ ఎన్నో శైవ క్షేత్రాలకు నెలవు..శివరాత్రి వస్తుందంటే చాలు శైవ క్షేత్రాలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తారు.. మహా వైభవంగా వేడుకలు నిర్వహిస్తారు.. ఐతే హన్మకొండలోని శ్రీ స్వయంభు సిద్దేశ్వర ఆలయంలో మాత్రం శివరాత్రికి మూడు రోజుల ముందు దశమి తిధి రోజు శివుడి కళ్యాణ ఘట్టం నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతుంది..
23 వ తేదీ ఆదివారం మాఘ బహుళ దశమి ముహూర్తాన ఉదయం 11 గంటలకు శ్రీ భవాని సహిత సిద్దేశ్వరస్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నారు.. ఈ నేపద్యంలో ఆలయాన్ని కళ్యాణ వేడుకకు పూర్తి స్థాయిలో సిద్ధం చేశారు.
కల్యాణ మహోత్సవానికి ముందు ఆనవాయితీ ప్రకారం సిద్దేశ్వరన్నీ పెళ్లి కొడుకులా ముస్తాబు చేశారు.. స్వయంభు సిద్దేశ్వరస్వామి లింగం వద్ద స్వామి వారినీ అచ్చం పెళ్ళి కొడుకులా ముస్తాబు చేసిన అలంకరణ ను చూసి భక్తులు మురిసి పోతున్నారు..