సింహాచలంలో వరుస ప్రమాదంలో భక్తులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. చందనోత్సవం సందర్భంగా గోడ కూలిన ఘటనలో.. ఏడుగురు భక్తులు ప్రాణాల కోల్పోయిన ఘటన మరువక ముందే గిరి ప్రదక్షణకు ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో కొండ దిగువున భారీ రేకుల షెడ్డు కూలిపోవడం భయాందోళనకు గురిచేసింది. అదృష్టవశాత్తు భక్తులెవరు ఆ ప్రాంతంలో లేకపోవడంతో పెనుముప్పే తప్పింది. అయితే.. సింహాచలంలో తాత్కాలిక నిర్మాణాలపై అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని భక్తులు ఆరోపిస్తున్నారు..
విశాఖలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలంలో గిరి ప్రదక్షిణకు సమయం దగ్గర పడుతున్న వేళ.. ఏర్పాట్లు ముమ్మరం చేశారు అధికారులు. ఈనెల 9వ తేదీన గిరి ప్రదక్షణ మొదలై పదవ తేదీన ముగుస్తుంది. 32 కిలోమీటర్ల పొడవునా ఉన్న సింహగిరి చుట్టూ భక్తులు ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీ. సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణ చేయడానికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. గత ఏడాది 10 లక్షల మంది గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. ఈసారి అంతకుమించి అనేలా 15 లక్షల మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.
గిరి ప్రదక్షణలో పాల్గొనే భక్తులు కొండ దిగువన తొలి పావనించే వద్ద కొబ్బరికాయ కొట్టి ప్రదక్షిణ ప్రారంభిస్తారు. అందుకోసం భక్తుల సౌకర్యార్థం భారీ రేకు షెడ్ల తాత్కాలిక నిర్మాణాలు చేస్తూ ఉన్నారు. గిరి ప్రదక్షిణ కోసం దేవస్థానం, అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. గిరి ప్రదక్షిణ వేళ.. ఎక్కడి కక్కడ భక్తుల కోసం విశ్రాంతి షెడ్లు, మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో తొలి పావంచా వద్ద భక్తుల విశ్రాంతి కోసం ఏర్పాటు చేసిన భారీ రేకుల షెడ్డు ఒక్కసారిగా కూలిపోయింది. షెడ్డు పునాదుల్లో కాంక్రీట్ వేయకపోవడం, బరువు ఎక్కువగా ఉండటంతో ఈ షెడ్డు ఒక్కసారిగా భారీ శబ్దంతో కూలిపోయింది. దీంతో ఒక్కసారిగా ఆంధ్రలో తీవ్ర కలవడం నింపింది. అదృష్టం వశాత్తు షెడ్డు కింద ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే ఈ ప్రమాదంపై భక్తులు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాదికి మించి భారీ ఏర్పాట్లు చేస్తున్నామని చెబుతున్న అధికారులు.. తాత్కాలిక షెడ్ల నిర్మాణం సరిగ్గా నిర్వహించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ ఈ ఘటనపై సీరియస్ అయ్యారు. తాత్కాలిక నిలుపువేసేలా ఆదేశించాలనే కలెక్టర్కు సిపి బాగ్చి సూచించారు. దీంతో కూలిపోయిన నిర్మాణాలను తొలగిస్తున్నట్లు త్రినాధ రావు ఆలయ ఈవో తెలిపారు.
ఇటీవల చందనోత్సవం సమయంలో జరిగిన ప్రమాదంలో ఏడుగురు భక్తులు మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో అప్పుడు.. అధికారుల తీరుపై విమర్శలు వినిపించాయి. ఇది మరువక ముందే.. గిరి ప్రదక్షిణ ఏర్పాట్లు సాగుతున్న ఈ సమయంలో ఇలా జరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఇలాంటి ఉత్సవాలకు కనీస భద్రతా ప్రమాణాలు పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. లక్షలాది మంది ప్రజలు పాల్గొనే గిరి ప్రదక్షిణలో ఇటువంటి సౌకర్యాల నిర్మాణంలో నిర్లక్ష్యం ఏంటని ప్రశ్నిస్తున్నారు. రేకు షెడ్డు నిర్మాణాలు ప్రత్యామ్నాయల పై దృష్టి పెట్టారు అధికారులు. గతంలో గోడ కూలిన ఘటనలో ఏడుగురు భక్తులు ప్రణాళిక కోల్పోయిన నేపథ్యంలో.. అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎలక్ట్రికల్ ఫైర్ తో పాటు మిగతా అన్ని శాఖల నుంచి ఎన్వోసీల పొందిన తర్వాతే ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తున్నామన్నారు కలెక్టర్ హరేంద్ర ప్రసాద్.
ఇప్పటికే గోడ కూలిన ఘటన ఇంకా భక్తుల్లో భయాన్ని విడలేదు. ఇప్పుడు తాజాగా రేకుల షెడ్డు కూలిపోయింది. నిర్మాణం జరుగుతున్న సమయంలో షెడ్డు కూలిపోయింది కాబట్టి సరిపోయింది.. అదే భక్తులంతా గ్రూపుదక్షణకు వచ్చి తొలి పావంచ వద్ద చేరుకున్న సమయంలో ఈ షెడ్డు కూలినట్టయితే పరిస్థితి ఏంటనేది ఇప్పుడు భక్తుల్లో ఉన్న ఆందోళన. ప్రభుత్వం అధికారంలో తక్షణమే స్పందించి ఆలయంలో పటిష్ట భద్రత చర్యలు చేపట్టాలన్న డిమాండ్ వ్యక్తమౌతోంది.