మీరు కూడా ఈ తప్పు చేస్తున్నారా.? గుండెపోటు వస్తుంది జాగ్రత్త..

గుండె సంబంధిత సమస్యల బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇందుకు ఎన్నో రకాల కారణాలు ఉన్నాయి. అయితే జీవనశైలి మొదలు తీసుకునే ఆహారం వరకు గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని మనందరకీ తెలిసిందే. అయితే మరో అలవాటు కూడా గుండె జబ్బులు వచ్చేందుకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు..

ఇటీవల గుండె జబ్బుల బారిన పడుతోన్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. పట్టుమని పాతికేళ్లు కూడా నిండని వారు గుండెపోటుతో కుప్పకూలి పోతున్నారు. ఆడుతుపాడుతు ఉంటూనే ఆద్యాంతరంగా తనువు చాలిస్తున్నారు. గుండె సంబంధిత సమస్యలు రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయని నిపుణులు చెబుతూనే ఉంటారు. అయితే మనకు తెలిసినంత వరకు తీసుకునే ఆహారంలో మార్పులు, చెడు జీవనశైలి, ఆయిల్‌ ఫుడ్‌ ఎక్కువగా తీసుకోవడం, స్మోకింగ్, ఆల్కహాల్‌ ఇవే.. ప్రధాన కారణాలుగా భావిస్తుంటాం.

వీటిలో నిజం కూడా ఉంది. అయితే ఇవి మాత్రమే కాకుండా మరో కారణం కూడా గుండె వ్యాధులు వచ్చేందుకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అదే గంటలతరబడి ఒకే చోట కూర్చోవడం. ప్రస్తుతం మారిన జీవన విధానం, వర్క్‌ కల్చర్‌ కారణంగా ఒకే చోట గంటలతరబడి కూర్చుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇలా తక్కువ శక్తి ఖర్చయ్యే పనులు చేసే వారిలో గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటున్నట్లు మాస్‌ జనరల్‌ బ్రైగమ్‌ పరిశోధకుల అధ్యయనంలో తేలింది.

ఇలా గంటలతరబడి ఒకేచోట కూర్చునే వారు వ్యాయామాలు చేసినా గుండె జబ్బు వచ్చే అవకాశం తగ్గడం లేదని పరిశోధనల్లో తేలింది. కాస్తో కూస్తో వ్యాయామం చేస్తున్నాం కదా! ఎక్కువసేపు కూర్చున్న ఫర్వాలేదని చాలా మంది భావిస్తుంటారు. కానీ తాజాగా నిర్వహించిన అధ్యయనంలో ఇందులో నిజం లేదని తేలింది. అయితే ఈ సమస్య నుంచి బయటపడే అవకాశం లేదా అంటే.. దానికి కూడా ఒక పరిష్కారం ఉందని నిపుణులు చెబుతున్నారు.

తప్పని పరిస్థితుల్లో ఎక్కువసేపు ఒకే చోట కూర్చోవాల్సి వచ్చే వారు చురుకుగా గడిపే సమయాన్ని పెంచుకోవాలని సూచిస్తున్నారు. కనీసం గంటకు ఒకసారైనా లేచి అటు ఇటు నడవాలని చెబుతున్నారు. పరిశోధనల్లో భాగంగా కూర్చుంటున్న సమయానికీ భవిష్యత్‌ గుండెజబ్బుల ముప్పులకూ మధ్య సంబంధాన్ని విశ్లేషించారు పరిశోధకులు. మెషిన్‌ లెర్నింగ్‌ ఆల్గొరిథమ్‌ల సాయంతో బద్ధకం తీరుతెన్నులను పరిశీలించారు.

ఎక్కువసేపు ఒకే చోట కూర్చునే వారికి గుండెలయ తప్పటం, గుండెపోటు, గుండె వైఫల్యం, గుండెజబ్బులతో మరణించే ముప్పులన్నీ పెరుగుతున్నట్లు పరిశోధనలో వెల్లడైంది. రోజులో 10.6 గంటల పాటు ఒకేచోట కదలకుండా కూర్చునే వారిలో గుండెజబ్బుతో మరణించే ముప్పు 40-60% ఎక్కువగా ఉంటున్నట్టు పరిశోధనల్లో తేలింది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

About Kadam

Check Also

మహారాష్ట్ర కొత్త సీఎంగా దేవేంద్ర ఫఢ్నవీస్‌.. ఏక్‌నాథ్‌షిండే, అజిత్‌పవార్‌కు కీలక పదవులు..?

మహారాష్ట్ర కొత్త సీఎం క్లారిటీ వచ్చేసింది. కొత్త ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. భారతీయ జనతా పార్టీ కోర్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *