దక్షిణ మధ్య రైల్వే కొత్తగా ప్రవేశపెట్టిన డి-రిజర్వ్డ్ టిక్కెట్ల గురించి మీకు తెలుసా? ఇవి రైలు బయలుదేరే ఒక గంట ముందు రిజర్వేషన్ కౌంటర్లలో అందుబాటులో ఉంటాయి. ఖాళీ స్లీపర్ బెర్తుల్లో ప్రయాణించేందుకు ఇవి అనుమతిస్తాయి. గరిష్టంగా 100 కి.మీ దూరం వరకు ప్రయాణించవచ్చు.
రైళ్లలో లాంగ్ జర్నీ చేసేవారు.. ముందుగానే రిజర్వేషన్ చేయించుకుంటారు. కొన్ని సార్లు సడెన్‌గా ఎక్కడికైనా వెళ్లా్ల్సి వచ్చిన సమయంలో తత్కాల్ టిక్కెట్ల కోసం చూస్తారు. అవి కూడా దొరకకుంటే.. ఇక వారికి జనరల్ బోగీలో దిక్కు. ఇక జనరల్ బోగీల గురించి తెలిసిందే. ఫుల్‌గా నిండి ఉంటుంది. సీట్ల సంగతి పక్కనపెట్టండి కొన్ని సార్లు నిలబడేందుకు, లోపలికి అడుగుపెట్టేందుకు కూడా చోటు ఉండదు. అంత దారుణంగా ఉంటుంది పరిస్థితి. ఇలా రిజర్వేషన్ లేక ఇబ్బందులు పడ్డవారు చాలా మందే ఉంటారు. జనరల్‌లో వెళ్లడం ఇబ్బందిగా భావించే వాళ్లకు ఇది ఒక వరం అని చెప్పొచ్చు. సౌత్ సెంట్రల్ రైల్వేస్ ఒక కొత్త డి-రిజర్వ్డ్ టికెట్ ప్రవేశపెట్టింది. ఈ టికెట్‌తో ట్రైన్లోని ఖాళీగా ఉన్న స్లీపర్ బెర్త్‌ల్లో ప్రయాణించవచ్చు. మరి ఆ టికెట్ ఎలా పొందాలి? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
డి-రిజర్వ్డ్ టికెట్.. ఇది ఒక ప్రత్యేక టికెట్ సౌకర్యం. ప్రయాణీకులు ఈ టికెట్‌ను ఉపయోగించి డీ రిజర్వ్ అయిన రైలు కంపార్ట్‌మెంట్లలో ముందుగానే రిజర్వేషన్ చేయకుండానే ప్రయాణించవచ్చు. ఇది సాధారణ రిజర్వ్ చేయని టిక్కెట్లకు ప్రత్యామ్నాయంగా అందిస్తారు.
డి-రిజర్వ్డ్ టికెట్.. ఇది ఒక ప్రత్యేక టికెట్ సౌకర్యం. ప్రయాణీకులు ఈ టికెట్‌ను ఉపయోగించి డీ రిజర్వ్ అయిన రైలు కంపార్ట్‌మెంట్లలో ముందుగానే రిజర్వేషన్ చేయకుండానే ప్రయాణించవచ్చు. ఇది సాధారణ రిజర్వ్ చేయని టిక్కెట్లకు ప్రత్యామ్నాయంగా అందిస్తారు.
ఉదాహరణకు కొన్ని రైళ్లలో ఒక నిర్దిష్ట స్లీపర్ కోచ్ (ఉదాహరణకు, S-12) ను రూట్‌లోని కొన్ని స్టేషన్ల మధ్యకు మాత్రమే డీ-రిజర్వ్‌డ్ (వేదికలేని) కోచ్‌గా ప్రకటిస్తారు. ఉదాహరణకు సికింద్రాబాద్, విజయవాడ మధ్య తిరిగే శాతవాహన ఎక్స్‌ప్రెస్‌లోని S-12 కోచ్‌లో ఖమ్మం నుంచి వరంగల్ వరకు డీ-రిజర్వ్‌డ్ అయి ఉంటే, ప్రయాణికులు ఆ కోచ్‌లో తమ ప్రయాణించిన దూరానికి అనుగుణంగా టికెట్ తీసుకొని ప్రయాణించవచ్చు.
ప్రస్తుతం దక్షిణ రైల్వే నడుపుతున్న 35 రైళ్లలో ఈ సౌకర్యం పనిచేస్తోంది. భవిష్యత్తులో దీనిని మరింత విస్తరిస్తామని అధికారులు చెబుతున్నారు. అందువల్ల మరిన్ని ట్రైన్లలో ఈ ఫెసిలిటీ అందుబాటులోకి వస్తే చాలా ప్రయోజనం కలుగుతుంది. రైలు టికెట్ కొనే ముందు మీరు ప్రయాణించాల్సిన రైలులో డి రిజర్వ్ కోచ్ సీట్లు అందుబాటులో ఉన్నాయా అని అడగండి. ఒక వేళ డి రిజర్వ్ సీటు ఉంటే మీరు టికెట్‌కు కావాల్సిన మొత్తాన్ని చెల్లించి, సంబంధిత కంపార్ట్‌మెంట్‌లో ఎటువంటి ఇబ్బంది లేకుండా హాయిగా ప్రయాణించవచ్చు.