ఎలాంటి ఫీజు లేకుండా దక్షిణ కొరియాలో చదువుకునే ఛాన్స్‌.. ఇలా దరఖాస్తు చేసుకోండి

విదేశాల్లో చదువుకోవాలని కలలు కనే విద్యార్ధులకు అద్భుత అవకాశం. దక్షిణ కొరియాలోని పలు యూనివర్సిటీల్లో చదువుకునేందుకు సియోల్ మెట్రోపాలిటన్ ప్రభుత్వం (SMG) సియోల్ టెక్ స్కాలర్‌షిప్ 2025కు ఇండియన్‌ విద్యార్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన జారీ చేసింది. ఈ ఇంటర్న్‌షిప్ ద్వారా భారతీయ విద్యార్థులెవరైనా దక్షిణ కొరియాలో పీజీ కోర్సులు చదవొచ్చు..

దక్షిణ కొరియాలోని సియోల్ మెట్రోపాలిటన్ ప్రభుత్వం (SMG) సియోల్ టెక్ స్కాలర్‌షిప్ 2025కు ఇండియన్‌ విద్యార్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన జారీ చేసింది. ఈ ఇంటర్న్‌షిప్ ద్వారా భారతీయ విద్యార్థులకు దక్షిణ కొరియాలోని సియోల్‌లోని ప్రముఖ యూనివర్సిటీల్లో మాస్టర్స్ డిగ్రీని 100 శాతం ఫీజు మినహాయింపుతో పొందే అవకాశాన్ని అందిస్తుంది. సైన్స్, ఇంజనీరింగ్ నేపథ్యం కలిగిన విద్యార్థులు ఈ ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు మార్చి 14, 2025లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ కొరియన్ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు తప్పనిసరిగా భారతదేశ పౌరుడై ఉండాలి. 1985 తర్వాత జన్మించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. NIRF ర్యాంకింగ్స్ ప్రకారం భారత్‌లోని టాప్ 100 యూనివర్సిటీల్లో సైన్స్ లేదా ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసి ఉండాలి. అలాగే కనీసం 80 శాతం మార్కులు లేదా టాప్ 20 శాతం CGPA కలిగి ఉండాలి. కొరియన్ యూనివర్సిటీలు అందించే అన్ని కోర్సులు కేవలం ఇంగ్లిష్‌లోనే నిర్వహించబడతాయి.

కొరియన్ స్కాలర్‌షిప్‌లో పాల్గొనే యూనివర్సిటీలు ఇవే..

  • సియోల్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ
  • సియోల్ యూనివర్సిటీ
  • కొరియా యూనివర్సిటీ
  • సూంగ్సిల్ యూనివర్సిటీ
  • క్వాంక్‌వూన్ యూనివర్సిటీ
  • క్యుంగ్ హీ యూనివర్సిటీ
  • సూక్మియుంగ్ మహిళా యూనివర్సిటీ
  • సియోక్యోంగ్ యూనివర్సిటీ
  • సుంగ్క్యుంక్వాన్ యూనివర్సిటీ

ఇంటర్న్‌షిప్ బెనిఫిట్స్‌ ఇవే

ఈ ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైన విద్యార్ధులకు పూర్తి ట్యూషన్ ఫీజు కవరేజ్ (50% SMG, 50% యూనివర్సిటీ ద్వారా) అవుతుంది. కొరియాకు ఒకసారి ఎకానమీ క్లాస్ ఫ్లైట్‌ టికెట్ లభిస్తుంది. నెలకు సుమారు రూ. 60 వేల వరకు స్కాలర్‌షిప్‌ అందిస్తారు. ఆరోగ్య బీమా ప్రీమియంల కవరేజ్ ఉంటుంది. గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ పూర్తయిన తర్వాత కొరియాలోనే ఉద్యోగం కల్పించేందుకు సహకారం అందిస్తారు.

సియోల్ టెక్ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేయాలంటే.. దరఖాస్తుతోపాటు ఇతర అవసరమైన పత్రాలను పోస్ట్ లేదా కొరియర్ ద్వారా సియోల్‌లోని భారత రాయబార కార్యాలయానికి పంపాలి. ప్రాసెసింగ్ సమయం దాదాపు 2 వారాల వరకు ఉంటుంది. కాబట్టి ఆసక్తి కలిగిన అభ్యర్థులు గడువు తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.

స్కాలర్‌షిప్ దరఖాస్తులు పంపవల్సిన అడ్రస్ ఇదే..

శ్రీమతి అనన్య అగర్వాల్ భారత రాయబార కార్యాలయం

సియోల్ 101

డోక్సోడాంగ్-రో

యోంగ్సాన్-గు సియోల్

రిపబ్లిక్ ఆఫ్ కొరియా పిన్ కోడ్: 04419

About Kadam

Check Also

ఉపాధి హామీలో ఇకపై అలా నడవదు.. రెండు సార్లు ఫొటో దిగితేనే కూలీలకు డబ్బులు..

ఉపాధి హామీ పథకం.. ఎంతో మంది నిరుపేద గ్రామస్థులకు ఈ పథకం ఒక వరం. గ్రామాల్లో సరిగ్గా పని లేనివారిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *