ప్లాస్ న్యూస్ ఏంటంటే.. నైరుతి రుతు పవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి ఎంట్రీ ఇచ్చాయి. అవి ఈ విషయాన్ని వెదర్ డిపార్ట్‌మెంట్ కన్ఫామ్చేసింది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లోకి విస్తరించాయని.. రాబోయే మూడు రోజుల్లో మిగిలిన ప్రాంతాలకు ముందుకు సాగడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని వెల్లడించింది.
వాతావరణ శాఖ రిపోర్ట్ ప్రకారం.. నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు, ముంబైతో సహా మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాలకు, బెంగళూరుతో సహా కర్ణాటకలోని మరికొన్ని ప్రాంతాలకు, తమిళనాడులోని మిగిలిన ప్రాంతాలకు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు, పశ్చిమ మధ్య, ఉత్తర బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు, మిజోరాంలోని మిగిలిన ప్రాంతాలకు, మొత్తం త్రిపుర, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయలోని కొన్ని ప్రాంతాలకు, మే 26న విస్తరించాయి.
రాబోయే 3 రోజుల్లో మధ్య అరేబియా సముద్రం, మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాలు, కర్ణాటకలోని మరికొన్ని ప్రాంతాలు, తెలంగాణలోని మరికొన్ని ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ మధ్యలోని మిగిలిన ప్రాంతాలు & ఉత్తర బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు… ఈశాన్య రాష్ట్రాలు.. పశ్చిమ బెంగాల్, సిక్కింలోని కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి.
కాగా ఉపరితల ద్రోణి ఇప్పుడు మరాఠ్వాడ మరియు పరిసర ప్రాంతాల మీదుగా ఉన్న అల్పపీడన ప్రాంతంతో సంబంధం ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి ఉత్తర తీరప్రాంత ఆంధ్రప్రదేశ్ వరకు ఉత్తర తెలంగాణ, దక్షిణ ఛత్తీస్‌గఢ్, దక్షిణ ఒడిశా మీదుగా సగటు సముద్ర మట్టానికి 3.1 & 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఎత్తుకు వెళ్ళేకొలది దక్షిణం దిశగా వంగి ఉంటుంది. నైరుతి రాజస్థాన్, దాని పరిసర ప్రాంతాల మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి వాయువ్య బంగాళాఖాతం వరకు తూర్పు రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఉత్తర ప్రాంతాలు, ఉత్తర ఛత్తీస్‌గఢ్, ఉత్తర ఒడిశా మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. మే 27వ తేదీ నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-
సోమవారం, మంగళవారం, బుధవారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు.. బలమైన ఈదురు గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-
సోమవారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఈదురు గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది.
మంగళవారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఈదురు గాలులు గంటకు 50-60 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది.
బుధవారం ;- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఈదురు గాలులు గంటకు 50-60 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది.
రాయలసీమ :-
సోమవారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది . ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది.
మంగళ, బుధవారాలు :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఆనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 50 -60 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది.