ఆమె అందరిలాగానే ఓ సాధారణ గృషిణి. భర్త, ఇద్దరు పిల్లలు. పెద్దగా కోరికలేవీ లేకపోయినా.. ఏనాటికైనా టీచర్ కావాలన్నది ఆమె జీవితాశయం. రాధా కుమారికి ఉపాధ్యాయ వృత్తి అంటే మహా ఇష్టం. ఆ ఇష్టమే.. బీఎడ్, డీఎడ్, ల్యాంగ్వేజ్ పండిట్.. ఇలా వరుస పెట్టి డిగ్రీలు చేయించింది. అంతేనా ఐదేళ్లపాటు ఓ వైపు సంసార రథాన్ని లాగుతూనే.. మరోవైపు డీఎస్సీకి లాంగ్ టర్మ్ కోచింగ్..
జీవితంలో ఏదో ఒకటి సాధించాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అందుకు లక్ష్యం అంటూ ఒకటి ఉండాలి. ఏం కావాలో, ఎటు వెళ్ళాలో, ఏం చేయాలో… వీటిని గురించి ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలి. గమ్యం చేరడానికి ఒక పథకం పక్కాగా ప్లాన్ చేయాలి. కానీ దీనిని అమలు చేయడం ఏమంత తేలికకాదు. ఎందుకంటే రియాలిటీ వేరే. జీవితం ఓ సమస్యల తోరణం. ఒకదాని తర్వాత ఒకటిగా తారసపడుతూనే ఉంటాయి. ఆ ప్రయత్నంలో ఎదురయ్యే వైఫల్యాలను గుణపాఠాలుగా నేర్చుకుని.. అధిగమిస్తేనే కోరుకున్న విజయం దక్కుతుంది. కానీ ఒడ్డుకు చేరాలంటే కష్టించేతత్వంతోపాటు, సహనం, ఆత్మవిశ్వసం, పట్టుదల, కృషి, ఓర్పు, నేర్పు ఎంతో కావాలి. ఈ చిన్న చిన్న మార్పులే మనల్ని గెలిపిస్తాయ్..! ఇది అక్షరాల నిజమని నిరూపించారు.. శ్రీకాకుళం జిల్లాలోని సరుబుజ్జిలి మండలం మతలబు పేట గ్రామానికి చెందిన చింతాడ రాధాకుమారి.
ఆమె అందరిలాగానే ఓ సాధారణ గృషిణి. భర్త, ఇద్దరు పిల్లలు. పెద్దగా కోరికలేవీ లేకపోయినా.. ఏనాటికైనా టీచర్ కావాలన్నది ఆమె జీవితాశయం. రాధా కుమారికి ఉపాధ్యాయ వృత్తి అంటే మహా ఇష్టం. ఆ ఇష్టమే.. బీఎడ్, డీఎడ్, ల్యాంగ్వేజ్ పండిట్.. ఇలా వరుస పెట్టి డిగ్రీలు చేయించింది. అంతేనా ఐదేళ్లపాటు ఓ వైపు సంసార రథాన్ని లాగుతూనే.. మరోవైపు డీఎస్సీకి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నారు. కూటమి సర్కార్ అధికారంలోకి రావడం.. 16,347 ఉపాధ్యాయ పోస్టులకు మెగా డీఎస్సీ ప్రకటించడం అన్నీ చకచకా జరిగిపోయాయి. తాను చదివిన డిగ్రీలన్నింటికీ సరిపోయే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు రాధా కుమారి. పరీక్షలు కూడా రాశారు. తాజాగా వెలువడిన మెగా డీఎస్సీ ఫలితాల్లో రాసిన అన్ని సబ్జెక్టుల్లోనూ ఎంపికై అందరినీ ఆశ్చర్యపరిచారు. అంతే ఒకే దెబ్బకు 5 ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికై రికార్డు సృష్టించారు.
ఎవరీ రాధా కుమారి?
శ్రీకాకుళం జిల్లాలోని సరుబుజ్జిలి మండలం మతలబు పేట గ్రామానికి చెందిన చింతాడ రాధాకుమారి, కేఎల్ నాయుడు దంపతులు. భర్త కేఎల్ నాయుడు హైదరాబాదులో ఎల్ఐసీ ఏజెంట్‌గా పనిచేస్తున్నారు. 2016 లో ఈ జంట ట్విన్స్ (పాప, బాబు) జన్మనిచ్చారు. అయితే పిల్లలు, సంసారం అంటూ జంజాటంలో మునిగిపోకుండా తన కలను నెరవేర్చుకోవాలని నిర్ణయించుకున్న రాధాకుమారి.. నాగార్జున యూనివర్సిటీ నుంచి MA తెలుగు సబ్జెక్టులో పీజీ పూర్తి చేవారు. ఆ తర్వాత వైజాగ్ నుంచి ల్యాంగ్వేజ్ పండిట్ కోర్సు (2018-19), ఉమ్మడి హైదరాబాద్‌లో టీటీసీ (2013), ఆంధ్రా యూనివర్సిటీ నుంచి 2023 బీఎడ్ డిగ్రీలు పూర్తి చేశారు. ఇక అప్పటి నుంచి YES and YES కోచింగ్ సెంటర్‌లో ఆన్‌లైన్‌లో లాంగ్ టర్మ్ శిక్షణ తీసుకోవడం ప్రారంభించారు. అలా ఓవైపు కోచింగ్ తీసుకుంటూనే టెట్ పరీక్షలు రాసి ఎస్జీటీలో ఏకంగా 19.18 వెయిటేజీ సాధించారు. స్కూల్ అసిస్టెంట్ సబ్జెక్టు్లోనూ గరిష్ఠంగా 17. 51 టెట్ వెయిటేజీ సాధించారు. ఈ ఏడాది విడుదలైన మెగా డీఎస్సీకి 5 సబ్జెక్టులకు (ఎస్జీటీ, SA తెలుగు, SA సోషల్ స్టడీస్, టీజీటీ తెలుగు, టీజీసీ సోషల్ స్టడీస్) దరఖాస్తు చేశారు. అహోరాత్రులు చదివి అన్ని పరీక్షలు రాశారు. ఇక జూన్‌లో నిర్వహించిన మెగా డీఎస్సీ పరీక్షలకు హాజరైనా ఆమె.. ఆగస్ట్ మొదటి వారంలో విడుదలైన డీఎస్సీ ఫలితాల్లో అనూహ్యంగా అన్ని సబ్జెక్టుల్లోనూ అత్యుత్తమ ర్యాంకులు సాధించారు.
ఏపీ మెగా డీఎస్సీ 2025లో రాధాకుమారి సాధించిన ర్యాంకులివే..
- SGT విభాగంలో 14వ ర్యాంక్ ను (చిత్తూరు నాలోకల్ )
- SA తెలుగులో 23 వ ర్యాంక్ (శ్రీకాకుళం)
- SA సోషల్ 39వ ర్యాంక్ (శ్రీకాకుళం)
- TGT సోషల్‌లో 77వ ర్యాంక్ (శ్రీకాకుళం)
- TGT తెలుగులో 113 వ ర్యాంకు (శ్రీకాకుళం)
రాథాకుమారి మెగా డీఎస్సీ 2025లో సాధించిన మార్కులు చూశారా?

నేటి యువతకు రాధాకుమారి విజయగాథ మార్గదర్శకం. ఎందుకుంటే ఉపాధ్యాయ కొలువు దక్కించుకోవాలనే ఆమె తపన మూడు టీచర్ ట్రైనింగ్ డిగ్రీలు చేసేలా ప్రేరేపించింది. పెళ్లైనా ఓ వైపు సంసారాన్ని చక్కదిద్దుకుంటూనే మిగతా సమయాల్లో చదువుకు కేటాయించారు. బాధ్యతలు, బాధలు ఆశయానికి అడ్డుకాదని ఆమె మరోమారు నిరూపించారు. దీని గురించి ఆమె మాట్లాడుతూ.. తన భర్త KL నాయుడు సహకారంతోనే ఇదంతా సాధించగలిగానని, అన్ని విధాలుగా సహకరించారని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. గృహిణిగా ఇద్దరు పిల్లలతో ఇన్ని ఉద్యోగాలకి ఎంపిక అవ్వడం పట్ల రాధా కుమారి కుటుంబ సభ్యులు ఆనందాన్ని తెలియజేశారు. ఇక రాధా కుమారి కుటుంబంలో మరిది ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ఆమె తమ్ముడు పంచాయితీ సెక్రటరీలుగా ఇప్పటికే సర్కార్ కొలువుల్లో కొనసాగుతున్నారు.