మరో 2 రోజుల్లోనే ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ టైర్‌ 1 రాత పరీక్షలు.. అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC).. తాజాగా కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవల్‌ ఎగ్జామినేషన్‌ 2025 టైర్‌ 1 రాత పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్ధులు తమ వివరాల ద్వారా లాగిన్‌ అయిన తర్వాత అడ్మిన్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఎస్సెస్సీ సీజీఎల్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులకు ఆన్‌లైన్‌ విధానంలో..

ఎస్సెస్సీ కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవల్‌ ఎగ్జామినేషన్‌ 2025 టైర్‌ 1 రాత పరీక్షలు మరో రెండు రోజుల్లో ప్రారంభంకానున్నాయి. ఈ క్రమంలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC).. తాజాగా ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్ధులు తమ వివరాల ద్వారా లాగిన్‌ అయిన తర్వాత అడ్మిన్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఎస్సెస్సీ సీజీఎల్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులకు ఆన్‌లైన్‌ విధానంలో కంప్యూటర్‌ ఆధారిత (సీబీటీ) పరీక్షలు సెప్టెంబర్‌ 12 నుంచి 26 వరకు జరగనున్నాయి. ఈ మేరకు ఇప్పటికే పరీక్షల షెడ్యూల్‌ కూడా విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 129 నగరాల్లో 260 పరీక్ష కేంద్రాలలో ఈ పరీక్షలు జరగనున్నాయి. దేశ వ్యాప్తంగా మొత్తం 28,14,604 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు.

పరీక్ష నగరానికి సంబంధించిన వివరాలను తెలుసుకోవడానికి ఇటీవలే సిటీ ఇంటిమేషన్‌ స్లిప్‌లను కూడా విడుదల చేసింది. ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌కు సంబంధించి ఇటీవల రిజర్వేషన్‌ ఆధారంగా పోస్టుల వివరాలను కూడా విడుదల చేసింది. కాగా ఈ ఏడాది జూన్‌లో సీజీఎల్‌ 14,582 గ్రూప్‌ ‘బి’, గ్రూప్‌ ‘సి’ పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమీషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలింసిందే. ఈ పోస్టులను టైర్‌ 1, టైర్‌ 2 రాత పరీక్షలతోపాటు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌, మెడికల్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఉస్మానియా యూనివర్సిటీ ఎంఈడీ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) జూన్‌ 2025కు సంబంధించిన 3వ సెమిస్టర్‌ ఫలితాలను తాజాగా విడుదల చేసింది. ఈ మేరకు ఫలితాలను యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. పరీక్షలు రాసిన అభ్యర్థులు తమ హాల్‌టికెట్‌ నంబర్‌ నమోదు చేసి అధికారిక వెబ్‌సైట్‌ నుంచి ఫలితాలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.


About Kadam

Check Also

నిరుద్యోగులకు భలే న్యూస్.. ఆర్టీసీలో డ్రైవర్, కండక్టర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ వచ్చేసిందోచ్‌!

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎట్టకేలకు నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఎప్పుడాని ఊరిస్తున్న ఆర్టీసీ ఉద్యోగాలకు మోక్షం కలిగిస్తూ ఉద్యోగ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *