మరో 2 రోజుల్లోనే ఎస్‌ఎస్‌సీ స్టెనోగ్రాఫర్‌ రాత పరీక్షలు.. వెబ్‌సైట్‌లో అడ్మిట్‌కార్డులు

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌ సి, డి పోస్టుల భర్తీకి సంబంధించిన రాత పరీక్షలు మరో రెండు రోజుల్లోనే జరగనున్నాయి. ఇప్పటికే సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులను విడుదల చేసిన కమిషన్‌.. తాజాగా అడ్మిట్‌ కార్డులను విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖస్తు చేసుకున్న అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌ లాగిన్‌ ద్వారా అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇక కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్షలు ఆగస్టు 6 నుంచి 11వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరగనున్నాయి. అడ్మిట్‌ కార్డులను డైన్‌లోడ్ చేసుకున్న తర్వాత అభ్యర్థులు ఎగ్జామ్‌కు హాజరయ్యే ముందు సంబంధిత సూచనలు తప్పనిసరి చదివి, తదనుగుణంగా మార్గదర్శకాలను అనుసరించవల్సి ఉంటుందని కమీషన్‌ సూచించింది.

కాగా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో మొత్తం 261 స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి పోస్టుల భర్తీకి ఈ ఏడాది జూన్‌లో నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇంటర్మీడియట్‌ అర్హతతో పోస్టులను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌తోపాటు స్కిల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

ఆగస్టు 6న దోస్త్‌ ప్రత్యేక విడత సీట్ల కేటాయింపు

తెలంగాణ రాష్ట్రంలోని కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌-తెలంగాణ (దోస్త్‌) ప్రత్యేక విడత ద్వారా డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు రిజిస్ట్రేషన్‌ గడువు ఆగస్టు 2వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. ఇక ఆగస్టు 6న సీట్ల కేటాయింపు వివరాలు వెల్లడించనున్నట్లు కన్వీనర్‌ ప్రొఫెసర్‌ వి బాలక్రిష్టారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

About Kadam

Check Also

కాళేశ్వరం అవినీతిలో హరీశ్ రావుది కీలక పాత్ర.. వారిద్దరి వల్లే కేసీఆర్‌కు అవినీతి మరకలు.. కవిత సంచలన ఆరోపణలు..

కాళేశ్వరం అవినీతిలో మాజీ మంత్రి హరీశ్ రావు పాత్ర కీలకమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేశారు. అందుకే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *