కెనడాకు వెళ్లిన కొడుకు తిరిగిరాని లోకాలకు.. అనుమానాస్పద మృతిగా తల్లిదండ్రుల ఆందోళన..!

చదువుకునేందుకు విదేశానికి వెళ్ళిన ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. ఆకస్మిక మరణం చెందినట్టు ఇంటికి సమాచారం అందగానే కన్నీరు మున్నిరై విలపించారు కుటుంబ సభ్యులు. మృతదేహాన్ని త్వరగా భారత్‌కు తీసుకువచ్చేలా చర్యలు తీసుకొని.. మృతి పై విచారణ జరిపించాలని అధికారులు, ప్రజాప్రతినిధులను కోరారు.

విశాఖ గాజువాక ప్రాంతానికి చెందిన 33 ఏళ్ల ఫణి కుమార్.. ఎంబీఏ పూర్తి చేశాడు. ఎమ్మెస్ చదువుల కోసం విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకుని.. కెనడాకు వెళ్ళాడు. ఆగస్టు 21న కెనడాలోని కాల్గరి నగరంలో ఉన్న సదరన్ ఆల్బర్ట్ ఆ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎమ్మెస్ కోర్సులో చేరాడు ఫణి కుమార్. స్నేహితులతో కలిసి హాస్టల్లో నివాసం ఉంటున్నాడు.

అయితే.. ఫణి కుమార్ రూమ్ మెట్ అయిన ఓ స్నేహితుడు నిద్రలోనే ఫణి కుమార్ ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం అందించాడు. దీంతో గుండెలు పట్టుకున్న ఆ కుటుంబ సభ్యులు.. గాజువాక ఎమ్మెల్యే టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకి విషయాన్ని తీసుకెళ్లి వినతి పత్రాన్ని సమర్పించారు. తమ కొడుకు మృతదేహాన్ని త్వరగా ఇండియాకు రప్పించేలా చర్యలు తీసుకోవాలని మరణంపై సమగ్ర విచారణ జరిగేలా చూడాలని వినతిపత్రం సమర్పించి కోరారు.

తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు  స్పందించిన పల్లా శ్రీనివాసరావు విశాఖ ఎంపీ భరత్ తో పాటు జిల్లా కలెక్టర్ కు లేఖలు రాస్తూ పరిస్థితిని వివరించారు. ఫణికుమార్ హఠాన్మరణం పై కారణాలు ఏంటనేది ఇంకా కుటుంబ సభ్యులకు అంతుచిక్కలేదు. దీంతో తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు ఫణి కుమార్ తండ్రి నాగప్రసాద్.

About Kadam

Check Also

ఆడపిల్లల పాలిట తోడేళ్లు.. మతి తప్పిన మదపిచ్చోళ్లు… ఒక్కోడు ఒక్కో టైపు

కామాతురాణాం నభయం నలజ్జ.. కామంతో కళ్లు మూసుకుపోయినవాడికి సిగ్గూ భయం రెండూ ఉండవు. మరి.. సమాజం పట్ల బాధ్యత ఉంటుందని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *