Tag Archives: air india

Flight Tickets: ఎయిరిండియా ఫ్లాష్ సేల్.. రూ.1444కే విమాన ప్రయాణం.. ఒక్క రోజే ఛాన్స్!

Flight Tickets: విమాన ప్రయాణికులకు అదిరే ఆఫర్. తక్కువ ధరకే విమానంలో చక్కర్లు కొట్టవచ్చు. తరుచూ ప్రయాణం చేసే వారితో పాటు ఒక్కసారైనా విమానం ఎక్కాలని భావించే వారికి ఇది ఒక మంచి అవకాశంగా చెప్పవచ్చు. ఇందుకోసం దేశీయ దిగ్గజ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా మరోసారి బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. ఫ్లాష్ సేల్ ప్రారంభించింది. ఇప్పటికే ఈ ప్రత్యేక సేల్ బుకింగ్స్ మొదలైపోయాయి. ఈ సేల్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుంటే రూ.1444కే విమానం ఎక్కడమే కాదు వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు …

Read More »

ఎయిర్‌ ఇండియా కీలక నిర్ణయం.. యూఎస్‌కు వెళ్లాల్సిన 60 విమానాలు రద్దు

విమాన ప్రయాణికులకు ఎయిర్‌లైన్‌ కంపెనీ షాక్ ఇచ్చింది. నవంబర్, డిసెంబర్‌లో ఇండియా నుంచి అమెరికా వెళ్లాల్సిన 60 విమానాలను రద్దు చేసినట్టు ప్రకటించింది. ప్రయాణికులకు డేట్ మార్చుకునే అవకాశం ఇవ్వడంతో పాటు టికెట్‌ డబ్బులు రిటర్న్‌ చేస్తున్నట్టు వెల్లడించింది. టాటా యాజమాన్యంలోని ఎయిర్‌ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది నవంబర్‌, డిసెంబర్‌ మధ్య భారత్‌ నుంచి యూఎస్‌కు నడవాల్సిన 60 విమానాలను క్యాన్సిల్ చేసింది. నిర్వహణ సమస్యల కారణంగా విమానాలు అందుబాటులో లేకపోవడంతో ఆయా విమానాలను రద్దు చేసినట్లు తెలిపింది. పీక్‌ …

Read More »

టెన్షన్ పెట్టిన ఎయిరిండియా విమానం.. అందరూ సేఫ్..

తమిళనాడులోని తిరుచిరాపల్లి విమానాశ్రయంలో ఎయిరిండియా విమానం అందరినీ టెన్షన్ పెట్టింది. 141 మంది ప్రయాణికులతో తిరుచ్చి నుంచి షార్జాకు ఎయిరిండియా విమానం బయల్దేరింది. అయితే టేకాఫ్ అయిన కాసేపటికే విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు పైలెట్లు గుర్తించారు. విమానంలో హైడ్రాలిక్ సమస్య తలెత్తినట్లు పైలెట్లు గుర్తించారు. దీంతో వెంటనే తిరుచ్చి ఎయిర్‌పోర్టు అధికారులను అప్రమత్తం చేశారు. అలాగే తిరుచ్చి విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. దీంతో అందరిలోనూ ఏం జరుగుతుందోననే ఆందోళన వ్యక్తమైంది. ఎయిర్‌పోర్టులో విమానం సేఫ్ ల్యాండింగ్ అవుతుందా కాదా అనే అనుమానాలు కూడా …

Read More »

ల్యాండింగ్ వేళ ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపులు.. ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ

Air India: ల్యాండింగ్ సమయంలో విమానంలో బాంబు ఉందంటూ వచ్చిన సమాచారంతో ఎయిర్‌పోర్టులో ఫుల్ ఎమర్జెన్సీ విధించారు. 135 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న విమానం.. ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ అవుతుండగా.. బాంబు బెదిరింపు సమాచారం వచ్చింది. దీంతో వెంటనే ఎయిర్‌పోర్టు అధికారులు పైలట్‌ను అలర్ట్ చేశారు. అయితే ఆ విమానం సేఫ్‌గా ల్యాండ్ అయిన తర్వాత వెంటనే అందులో ఉన్న ప్రయాణికులను హుటాహుటిన బయటికి రప్పించారు. అనంతరం ఆ విమానంలో గాలింపు చేపట్టారు. మరోవైపు.. ఈ ఘటనతో ఎయిర్‌పోర్టు మొత్తం పూర్తిస్థాయి ఎమర్జెన్సీ విధించారు. కేరళ …

Read More »