Chadrababu Natarajan Chandrasekaran meeting: ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 కోసం ప్రభుత్వం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయనుంది. మేధావులు, పరిశ్రమల ప్రమఖులు సభ్యులుగా ఈ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయనున్నారు. ఈ టాస్క్‌ఫోర్స్‌కు టాటా సన్స్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ కో ఛైర్మన్‌గా ఉంటారు. ఈ విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా.. ప్రకటించారు. శుక్రవారం టాటా సన్స్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడితో …
Read More »Tag Archives: amaravati
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మరో ఏడాది ఉచితం, ఉత్తర్వులు జారీ!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. హైకోర్టు, రాజ్‌భవన్ ఉద్యోగులకు మరో ఏడాది ఉచిత వసతి పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చిన ఉద్యోగులకు వసతి పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సచివాలయం, హెచ్‌వోడీ, అసెంబ్లీ ఉద్యోగులకు మరో ఏడాది ఉచిత వసతి కొనసాగిస్తున్నారు. తాజాగా హైకోర్టు, రాజ్‌భవన్ ఉద్యోగులకు మరో ఏడాది ఉచిత వసతి పొడిగించారు.. 2025 జూన్ 26 వరకు ఉచిత వసతి కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చారు. ఉచిత వసతి పొడిగించినందుకు ప్రభుత్వానికి ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు. …
Read More »ఏపీలో వెయిటింగ్‌లోని ఐపీఎస్‌లకు మెమోలు.. ఆ కేసులు నీరుగార్చేలా, నిఘా విభాగం సంచలనాలు
ఏపీలో వెయిటింగ్‌లో ఉన్న ఐపీఎస్‌లకు డీజీపీ మెమో జారీ చేసిన సంగతి తెలిసిందే. ఐపీఎస్‌లకు మెమోలు జారీ వెనుక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇటీవల విచారణకు ఆదేశించిన కేసులను నీరుగార్చేలా కొందరు ఐపీఎస్‌లు కుట్ర చేసినట్లు రాష్ట్ర ఇంటిలిజెన్స్ (నిఘా) విభాగం గుర్తించిందట. వివిధ కేసుల్లో జరుగుతున్న అంతర్గత విచారణను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నాలు సాగించినట్లు డీజీపీ కార్యాలయం గుర్తించారట. ఈ వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక అందజేయడంతో.. వెంటనే డీజీపీ కార్యాలయం అలర్ట్ అయ్యింది. వెయిటింగ్‌లో …
Read More »భార్యతో కలిసి సామాన్యుడిలా విమాన ప్రయాణం చేసిన జగన్.. ఫొటో వైరల్
అమరావతి: అధికారంలో ఉన్నప్పుడు పరదాలు కట్టి ప్రజల్లోకి వెళ్లిన మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్(YS Jagan) ఇప్పుడు తాను సామాన్యమైన వ్యక్తినని కవరింగ్ ఇచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. జగన్ ఆయన భార్య భారతి కలిసి ఉన్న ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైసీపీ అధినేత సాధారణ వ్యక్తిలా విమానంలో భార్యతో కలిసి ప్రయాణించారు. గతంలో సీఎంగా ప్రత్యేక విమానాల్లో ప్రయాణించిన ఆయన ప్రస్తుతం సామాన్యుడిలా సాధారణ విమానాల్లో ఎకానమీ క్లాసులో ప్రయాణిస్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ …
Read More »ఐటీ-ఎలక్ట్రానిక్స్ , ఆర్టీజీ శాఖలపై నేడు చంద్రబాబు సమీక్ష
ఐటీ-ఎలక్ట్రానిక్స్ , ఆర్టీజీ శాఖలపై నేడు సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. ఐటీ పెట్టుబడులను ఏపీ రప్పించేలా కొత్త ఐటీ పాలసీ రూపకల్పనపై చర్చ జరగనుంది. విశాఖ కేంద్రంగా ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు కసరత్తు నిర్వహించనున్నారు. అమరావతి: ఐటీ-ఎలక్ట్రానిక్స్ , ఆర్టీజీ (రియల్ టైమ్ గవర్నెన్స్) శాఖలపై నేడు సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. ఐటీ పెట్టుబడులను ఏపీకి రప్పించేలా కొత్త ఐటీ పాలసీ రూపకల్పనపై ఈ సమీక్షలో చర్చ జరగనుంది. విశాఖ కేంద్రంగా ఐటీ పరిశ్రమల ఏర్పాటుపై మాట్లాడనున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏపీ …
Read More »ఏపీలో ఉచిత బస్సు ప్రయాణంపై కీలక అప్‌డేట్.. ఆ రోజే చంద్రబాబు రివ్యూ.. ఆ డేట్ ఫిక్సా?
ఏపీలో మహిళలకు త్వరలోనే ప్రభుత్వం శుభవార్త వినిపించనుంది. ఈ విషయాన్ని ఏపీ రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై సీఎం నారా చంద్రబాబు నాయుడు సమీక్షించనున్నారు. ఆగస్ట్ 12వ తేదీన ఆర్టీసీ, రవాణాశాఖపై చంద్రబాబు సమీక్షిస్తారని ఏపీ రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీ అమలుపైనా చంద్రబాబు చర్చిస్తారని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం త్వరలోనే ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి …
Read More »ఏపీకి కేంద్రం మరో అదిరిపోయే శుభవార్త..
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం బడ్జెట్‌లో ప్రాధాన్యం కల్పించింది. అమరావతి, పోలవరంతో పాటూ పలు కీలక ప్రకటనలు చేసింది. వీటితో పాటూగా కేంద్ర పన్నుల్లో రాష్ట్రానికి వాటాపై కూడా క్లారిటీ వచ్చిది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.50,474.64 కోట్ల వాటా రానుంది.. ఇది గతేడాది కంటే రూ.5,776 కోట్లు (12.92%) అధికం అని కేంద్రం తెలిపింది. గత ఫిబ్రవరిలో రూ.49,364.61 కోట్లతో పోలిస్తే.. రూ.1,110 కోట్లు ఎక్కువ. కేంద్రం 2024-25 ఆర్థిక సంవత్సరంలో అన్ని రాష్ట్రాలకు కలిపి రూ.12,47,211.28 కోట్ల వాటాను పంచనుంది. ఇందులో 4.047% ఆంధ్రప్రదేశ్‌కు …
Read More »గుమ్మం వద్దకే పెంచిన పింఛన్లు
జూలై 1న రూ.7 వేలు ఇస్తాం.. వలంటీర్ వ్యవస్థపై త్వరలోనే నిర్ణయం.. మంత్రులు నిమ్మల, డోలా, సవిత అమరావతి: జూలై ఒకటో తేదీ ఉదయాన్నే సామాజిక భద్రత పింఛన్లను లబ్ధిదారుల గుమ్మం వద్దే అందజేస్తామని రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు పింఛన్ల పెంపుతో పాటు, డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు, అన్నా క్యాంటిన్లు, స్కిల్ సెన్సెస్ ఫైళ్లపై సీఎం చంద్రబాబు సంతకాలు చేశారని వివరించారు. రాష్ట్ర సచివాలయంలో గురువారం మంత్రి రామానాయుడు మీడియాతో మాట్లాడుతూ.. వృద్ధులు, …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal