ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రైతులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. మొత్తానికి రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు పెండింగ్లో ఉన్న వార్షిక కౌలును సీఆర్డీఏ చెల్లించబోతోంది. అమరావతి రైతులకు కౌలు నిమిత్తం ప్రభుత్వం ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్లో రూ.400 కోట్లు కేటాయించింది. ఆ నిధుల్ని సీఆర్డీఏకు విడుదల చేస్తూ పాలనాపరమైన అనుమతులు కూడా జారీ చేశారు. అంతేకాదు అమరావతిలో ప్రస్తుత హైకోర్టు భవనం ప్రాంగణంలో అదనపు నిర్మాణాలకు సంబంధించి రూ.13.33 కోట్లను సీఆర్డీఏ విడుదల చేసింది. మరోవైపు అమరావతిలో హైకోర్టు, సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ …
Read More »