హోంమంత్రి అమిత్ షా కొత్త రికార్డు సృష్టించారు. కేంద్ర హోంమంత్రిగా అత్యధిక కాలం పనిచేసిన వ్యక్తిగా నిలిచారు. 2,258 రోజులు హోంమంత్రిగా పనిచేసిన అమిత్ షా, బీజేపీ సీనియర్ నాయకుడు లాల్ కృష్ణ అద్వానీ రికార్డును బద్దలు కొట్టారు. అత్యంత ఎక్కువ కాలం పనిచేసిన కేంద్ర హోంమంత్రిగా నిలిచారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వంలో రెండవసారి ఆయన మే 30, 2019న పదవీ బాధ్యతలు స్వీకరించారు. మంగళవారం (ఆగస్టు 5) జరిగిన నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) పార్లమెంటరీ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ …
Read More »Tag Archives: Amit Shah
పహల్గామ్ ఉగ్రవాదులను మట్టిలో కలిపేశాం… లోక్‌సభలో విపక్షాలపై అమిత్‌షా విసుర్లు
పహల్గామ్‌లో పర్యాటకులను హత్య చేసిన ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా లోక్‌సభలో ప్రకటించారు. ఆపరేషన్ సింధూర్‌పై లోక్‌సభలో చర్చ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా అమిత్‌షా కీలక వ్యాఖ్యలు చేశారు. టూరిస్టులను ఉగ్రవాదులు కిరాతకంగా హత్యచేశాని అన్నారు అమిత్ షా. కుటుంబాల ముందే పర్యాటకుల్ని దారుణంగా చంపారు. మతం పేరు అడిగి మరీ చంపడం దారుణం అన్న అమిత్ షా… పహల్గామ్ ప్రతీకారాన్ని ధృవీకరించారు. ఆపరేషన్ మహాదేవ్‌లో భాగంగా ముగ్గురు ఉగ్రవాదులను బద్రతా బలగాలు మట్టుబట్టాయని స్పష్టం చేశారు. …
Read More »గుడ్‌న్యూస్.. ఓలా, ఉబర్, ర్యాపిడో దోపిడికి చెక్.. త్వరలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి సహకార్ యాప్!
ప్రధాన నగరాల్లో ఓలా, ఉబర్, ర్యాపిడోల వినియోగం బాగా పెరిగిపోయింది. విపరీతంగా పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా.. ఆయా కంపెనీలు వినియోగదారుల నుంచి భారీగా ఛార్జీలు వస్తూలు చేస్తున్నాయి. అలా అని క్యాబ్ డ్రైవర్లు అంతే మొత్తం చెల్లించడం లేదు. కస్టమర్ నుంచి తీసుకున్న ఛార్జీలో భారీగా కోత విధించి.. మిగతా డబ్బును డ్రైవర్లకు, రైడర్లకు చెల్లిస్తున్నాయి. వీటిపై డ్రైవర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సూపర్ ఐడియాతో ముందుకు వచ్చింది. సహకార్ ట్యాక్సీ పేరుతో ఒక …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal