కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు కొలువైన తిరుమలకు నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. అలా వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు టీటీడీ నిత్యం కృషి చేస్తూ ఉంటుంది. అయితే రద్దీ వేళల్లో శ్రీవారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో గంటల తరబడి నిరీక్షించాల్సి ఉంటుంది. ఈ సమయాన్ని తగ్గించేందుకు కూడా టీటీడీ చర్యలు ప్రారంభించింది. ఈ విషయాన్ని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు.టీటీడీ పరిపాలన భవనంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొన్న ఆయన.. జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఉద్యోగులను …
Read More »Tag Archives: andhr apradesh
ఏపీలో వెయిటింగ్‌లోని ఐపీఎస్‌లకు మెమోలు.. ఆ కేసులు నీరుగార్చేలా, నిఘా విభాగం సంచలనాలు
ఏపీలో వెయిటింగ్‌లో ఉన్న ఐపీఎస్‌లకు డీజీపీ మెమో జారీ చేసిన సంగతి తెలిసిందే. ఐపీఎస్‌లకు మెమోలు జారీ వెనుక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇటీవల విచారణకు ఆదేశించిన కేసులను నీరుగార్చేలా కొందరు ఐపీఎస్‌లు కుట్ర చేసినట్లు రాష్ట్ర ఇంటిలిజెన్స్ (నిఘా) విభాగం గుర్తించిందట. వివిధ కేసుల్లో జరుగుతున్న అంతర్గత విచారణను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నాలు సాగించినట్లు డీజీపీ కార్యాలయం గుర్తించారట. ఈ వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక అందజేయడంతో.. వెంటనే డీజీపీ కార్యాలయం అలర్ట్ అయ్యింది. వెయిటింగ్‌లో …
Read More »ఏపీ కేబినెట్ భేటీ ఆగస్టు 7కు వాయిదా..
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. వాస్తవానికి ఆగస్టు 2న మంత్రివర్గ సమావేశం జరగాల్సి ఉండగా వాయిదా పడింది.. ఆగస్టు 7న సమావేశం నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు ఆగస్టు 1న శ్రీశైలం పర్యటనకు వెళతారు.. అలాగే శ్రీసత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం గుండుమలలో పింఛన్లు పంపిణీ చేయనున్నారు. వరుస పర్యటనల కారణంగానే కేబినెట్ భేటీని వాయిదా వేశారని తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ మంత్రివర్గ సమావేశానికి సంబంధించి వివిధ …
Read More »ఏపీలో మరోసారి ఎన్నికలు.. ఆగస్టు 30న పోలింగ్, మూడు జిల్లాల్లో కోడ్ అమల్లోకి
ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ వచ్చేసింది. విశాఖపట్నం జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఉపఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వైఎస్సార్‌సీపీ తరఫున వంశీకృష్ణ శ్రీనివాస్ గెలిచారు. అయితే ఆయన జనసేన పార్టీలో చేరగా.. అనంతరం అనర్హత వేటు వేయడంతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయ్యింది. ఆ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు షెడ్యూల్ వచ్చిందని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఆగస్టు 6న ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదలవుతుంది.. …
Read More »కేంద్రం నుంచి ఏపీకి తీపికబురు.
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం శుభవార్త చెప్పింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమల్లో భాగంగా కేంద్రం రాష్ట్రానికి అదనంగా 6.50 కోట్ల పనిదినాలు కేటాయించిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. మొదట మంజూరు చేసిన 15 కోట్ల పనిదినాలు జూన్ నెలాఖరుకే పూర్తికాగా.. కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో అదనపు అవసరాలను దృష్టిలో పెట్టుకుని.. మరో 6.50 కోట్ల పనిదినాలకు ఆమోదం తెలిపినట్లు పవన్ తెలిపారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం …
Read More »ఏపీలో వాలంటీర్లకు గుడ్‌న్యూస్..
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీపి కబురు చెప్పారు. సాంఘిక సంక్షేమశాఖపై సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థపై చర్చకు వచ్చింది. రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు, వాలంటీర్ల సేవలు మరింత సమర్థంగా వినియోగించుకునేలా ఆలోచనలు చేయాలని అధికారుల్ని చంద్రబాబు ఆదేశించారు. సచివాలయాల్లో ఉద్యోగులు, వాలంటీర్లందరినీ ప్రభుత్వం కొనసాగిస్తుందని.. వీరి ద్వారా ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు ఎలా అందించాలన్న అంశంపై సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఈ మేరకు ఆ దిశగా కసరత్తు …
Read More »ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు..
ఆంధ్రప్రదేశ్ సచివాలయ, హెచ్‌వోడీ ఉద్యోగులకు చంద్రబాబు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. హెచ్‌ఆర్‌ఏ (ఇంటి అద్దె భత్యం) 24 శాతం కొనసాగింపుపై సచివాలయ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు నూతన ప్రభుత్వంలో.. 12వ పీఆర్‌సీ కమిషనర్‌ని నియమించాలని కోరారు.. త్వరగా ఉద్యోగులకు పీఆర్‌సీ అమలు చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని ఓ ప్రకటనలో కోరారు. గత ప్రభుత్వం హయాంలోని భూ ఆక్రమణలపై ఇవాళ కీలక సమీక్షా సమావేశం జరగనుంది. ప్రధానంా …
Read More »