Tag Archives: andhra pradesh

ఏపీలో పింఛన్ డబ్బులు ఒకరోజు ముందుగానే ఇస్తారు.. కారణం ఇదే, ఈ నెల నుంచి మరో కొత్త రూల్!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్ల పంపిణీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ నెలకు సంబంధించిన పింఛన్‌ను ఒకరోజు ముందుగానే పంపిణీ చేయనున్నారు. వాస్తవానికి ప్రభుత్వం ప్రతి నెలా ఒకటో తేదీన పింఛన్ డబ్బుల్ని పంపిణీ చేస్తోంది. కానీ ఒకటో తేదీన సెలవు అయితే మాత్రం ముందు రోజే పింఛన్ పంపిణీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే డిసెంబర్ 1 ఆదివారం కావడంతో పింఛన్ డబ్బుల్ని ఒక రోజు ముందుగానే.. అంటే నవంబర్ 30వ తేదీనే పంపిణీ చేయనున్నారు. పింఛన్ తీసుకునేవారు ఈ విషయాన్ని …

Read More »

ఏపీలో కాలేజీలకు సీరియస్ వార్నింగ్.. రూ.15 లక్షలు జరిమానా, విద్యార్థులకు పండగే

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నిబంధనలు ఉల్లంఘించే ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థుల ఒరిజినల్‌ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం.. నిర్దేశిత ఫీజుల కంటే అధికంగా వసూలు చేయడం వంటి ఫిర్యాదులు వస్తున్నాయంది ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ హెచ్చరించింది. అలా నిబంధనలు ఉల్లంఘించే విద్యాసంస్థలకు రూ.15 లక్షల జరిమానా విధించే అధికారం కమిషన్‌కు ఉందని గుర్తు చేశారు. కొన్ని విద్యా సంస్థలు కోర్సు పూర్తైనా సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని.. ప్రభుత్వ ఆదేశాల్లో పేర్కొన్న ఫీజు కంటే ఎక్కువగా …

Read More »

ఏపీకి మరో ఇంటర్నేషనల్ కంపెనీ.. 300 ఎకరాల్లో ప్లాంట్, వెండార్ పార్క్! దశ తిరిగినట్లే..

టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే పలు ఎంవోయూలు కూడా కుదిరాయి. తాజాగా మరో వార్త బయటకు వచ్చింది. ప్రముఖ ఎలక్ర్టానిక్స్ సంస్థ ఎల్‌జీ ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఎల్‌జీతో పాటుగా ఆ కంపెనీకి విడిభాగాలు సరఫరా చేసే కొరియా, చైనీస్ సంస్థలు కూడా.. భారతదేశంలో రూ.7000 కోట్లు పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. రూ.7 వేల కోట్లతో ఎల్‌జీ …

Read More »

తిరుమల రూపురేఖలు మారబోతున్నాయి.. త్వరలోనే, టీటీడీ ఈవో కీలక వ్యాఖ్యలు

తిరుమలను పక్కా ప్రణాళికతో కూడిన మోడల్‌ టౌన్‌గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు టీటీడీ ఈవో జే శ్యామలరావు. తిరుపతిలోని పరిపాలన భవనంలోని మీటింగ్‌ హాల్‌లో తిరుమలకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హిందూ ధార్మిక కేంద్రమైన తిరుమలను మోడల్ టౌన్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా డిజైన్లు రూపొందించాలన్నారు. ఇందుకోసం విజన్ డాక్యుమెంట్ తక్షణావసరం అని, టీటీడీకి అర్బన్ డెవలప్‌మెంట్ అండ్ టౌన్ ప్లానింగ్ వింగ్‌ను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. తిరుమలలో పాదచారులకు అనుకూలంగా ఫుట్‌పాత్‌లను మార్చడంతో పాటు ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు …

Read More »

ఏపీలో ఆ ఉద్యోగులందరూ తొలగింపు.. ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీఎండీసీ (ఖనిజాభివృద్ధి సంస్థ)లో మరోసారి ఉద్యోగుల్ని తొలగించారు. గత ప్రభుత్వం (2019-2024) మధ్య పొరుగుసేవలు, కాంట్రాక్ట్‌ విధానంలో సిఫార్సులతో చేరిన మరో 90 మందిని తొలగిస్తూ ఏపీఎండీసీ ఎండీ ప్రవీణ్‌కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో సిఫార్సులతో ఉద్యోగుల్ని చేర్చుకున్నారు. అప్పటి గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితోపాటు, పలువురు ప్రజా ప్రతినిధు సిఫార్సులతో వందల మంది ఉద్యోగులు చేరారు. 2019లో ఏపీఎండీసీ ఇసుక వ్యాపారం చేసినప్పుడు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1,500 మందిని ఔట్ …

Read More »

వైసీపీ సంచలన నిర్ణయం.. పీఏసీ ఛైర్మన్ పదవికి నామినేషన్, మాజీ మంత్రికి ఛాన్స్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో కీలక పరిణామం జరిగింది. ఇవాళ శాసనసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఎస్టిమేట్స్ కమిటీ, అండర్ టేకింగ్ కమిటీలకు ఎన్నిక జరగనుండగా.. పీఏసీ ఛైర్మన్ పదవి వైఎస్సార్‌‌సీపీ తరఫున పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. పెద్దిరెడ్డి నామినేషన్‌ని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్ బలపరిచారు. పెద్దిరెడ్డి వెంట పలువరు ఎమ్మెల్సీలు కూడా తరలి వచ్చారు. పీఏసీ పదవికి కేబినెట్ హోదా ఉండటంతో ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీలో అధికారుల తీరుపై వైఎస్సార్‌సీపీ ఆగ్రహం …

Read More »

ఏపీలో విద్యార్థులకు శుభవార్త.. అకౌంట్‌లలోకి డబ్బులు జమ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. గత ఐదేళ్లుగా అమల్లో ఉన్న విధానానికి స్వస్తి పలికింది.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద చెల్లించాల్సిన ఫీజులను నేరుగా కాలేజీల ఖాతాలకు జమ చేసే విధానం తీసుకొచ్చింది.. ఈ విద్యా సంవత్సరం నుంచే దీనిని అమలు చేస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ తెలిపింది. 2024-25 విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు ఇచ్చే ఫీజులు (ఎస్సీ విద్యార్థులు మినహా) కాలేజీల …

Read More »

మేయర్ పదవిలో ఉన్న వ్యక్తి మాట్లాడేది ఇలాగేనా, శిక్షించాల్సిందే.. ఏపీ హైకోర్టు సీరియస్

గుంటూరు మేయర్, వైఎస్సార్‌సీపీ నేత కావటి మనోహర్‌నాయుడిపై హైకోర్టు సీరియస్ కామెంట్స్ చేసింది. గుంటూరుకు మేయర్, నగర ప్రథమ పౌరుడు మాట్లాడే భాష ఇలాగేనా ఉండేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మేయర్‌ వంటి పదవిలో ఉన్న వ్యక్తికి బాధ్యత ఉండక్కర్లేదా అంటూ మండిపడింది. ఒకవేళ రాజకీయ పార్టీ విధానాలు నచ్చకపోతే విమర్శించడంలో తప్పు లేదని.. అసభ్య పదజాలంతో వారి కుటుంబ సభ్యులు, తల్లులపై దాడి చేయడం ఏంటని ప్రశ్నించింది. ఏ పార్టీ వారైనా సరే అసభ్యకరమైన భాషను ఉపయోగిస్తే శిక్షించాల్సిందేనని అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. …

Read More »

ఆ రెండు ఖరీదైన BMW కార్లు ఎక్కడ.. ఆరా తీసిన పవన్ కళ్యాణ్, అధికారుల సమాధానం ఏంటో తెలిస్తే!

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటవీశాఖకు సంబంధించి రెండు అత్యంత ఖరీదైన బీఎండబ్ల్యూ కార్ల గురించి ఆరా తీశారు. గతంలో ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి ఈ రెండు కార్లను స్వాధీనం చేసుకోగా.. అవి మాయం అయ్యాయి. ఈ కార్లలో ఒకటి 2017 నవంబరులో అప్పటి అటవీశాఖ ముఖ్య కార్యదర్శి అనంతరాముకు కేటాయించగా.. ఆ తర్వాత ప్రస్తుత సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆ బాధ్యతల్లో ఉన్నారు. అయితే ఆ తర్వాత ఆ కారు ఏమైందో ఎవరికి తెలియకపోవడం విశేషం.. ఎవరి దగ్గర ఉంది.. …

Read More »

వాలంటీర్ల కొనసాగింపుపై అసెంబ్లీలో మంత్రి కీలక ప్రకటన

వాలంటీర్ల వ్యవస్థపై అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఆ వ్యవస్థ ఉనికిలో లేదని తేల్చి చెప్పింది. సెప్టెంబరు 2023లో రెన్యువల్ చేయాల్సి ఉన్నప్పటికీ నాటి ప్రభుత్వం విస్మరించిందని తెలిపింది. వైఎస్ జగన్ ప్రభుత్వమే ఆ వ్యవస్థను నాశనం చేసిందని ఈ మేరకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి శాసన మండలిలో బుధవారం ప్రకటన చేశారు. మండలిలో వాలంటీర్ వ్యవస్థపై చర్చ సందర్భంగా అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మంత్రి విరాంజనేయస్వామి, మండలిలో ప్రతిపక్ష నేత …

Read More »