ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఇప్పటికే పింఛన్ పెంపు, మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తూ నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ల హామీల అమలుపైనా ఫోకస్ పెట్టారు. తాజాగా మరో హామీ అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది.. ఈ మేరుకు దరఖాస్తుల్ని కూడా ఆహ్వానిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువతకు ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీని నెరవేర్చే పనిలో ఉంది. అయితే ఇక్కడ మాత్రం …
Read More »Tag Archives: andhra pradesh
వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ సస్పెండ్.. ఏపీ మంత్రిపై పోటీచేసి ఓడిన సీనియర్ నేత
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ఎదురుగాలి వీచింది. ఆ పార్టీ కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం అయ్యింది.. అయితే ఆ తర్వాత నుంచి వరుసగా కష్టాలు మొదలయ్యాయి. నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు.. ఏకంగా ఇద్దరు ఎంపీలు, ముగ్గరు ఎమ్మెల్సీలు గుడ్ బై చెప్పారు. అలాగే వైఎస్సార్‌సీపీలో సీనియర్లుగా ఉన్నవారంతా టీడీపీ, జనసేన పార్టీల్లో చేరిపోతున్నారు. అయితే వైఎస్సార్‌సీపీ మాత్రం పార్టీ నుంచి ఒకరిద్దరు నేతల్ని సస్పెండ్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఇటీవల మాజీ మంత్రి రోజా నియోజకవర్గంలో కేజే శాంతి, కుమార్ …
Read More »ఏపీలో డ్వాక్రా మహిళలకు తీపికబురు.. ఏకంగా రూ.10 లక్షలు, వడ్డీ కూడా ఉండదు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అమరావతిలోని సచివాలయంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (సెర్ప్) కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. డ్వాక్రా మహిళలకు రుణాలు, ఆడబిడ్డ నిధి పథకం మార్గదర్శకాలు వంటి పలు కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో డ్వాక్రా సంఘాలకు రూ.10 లక్షల వరకు సున్నావడ్డీ రుణాల అమలుపై చర్చించారు. ఈ రుణాలకు సంబంధించి ఏడాదికి రూ.5 వేల కోట్లు అవుతుందని అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. దీనికి సంబంధించి తదుపరి సమావేశంలోగా విధి విధానాలు రూపొందించాలని అధికారులకు సూచించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ …
Read More »తిరుపతి లడ్డూ టెస్టు రిపోర్టులో షాకింగ్ అంశాలు.. నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందా?
తిరుమల లడ్డూ నాణ్యతపై రాజకీయ దుమారం రేగుతుండగా.. తాజాగా వెలుగులోకి వచ్చిన రిపోర్టులోని మరింత సంచలనంగా మారాయి. తిరుమల వేంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యి శాంపిల్స్‌ను పరీక్షల కోసం నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డు ల్యాబొరేటరీకి పంపించారు. గుజరాత్‌లోని ఆనంద్‌లో ఉన్న ఈ ల్యాబొరేటరీకి దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. తిరుమలలో ఉపయోగించిన నెయ్యికి సంబంధించి ఈ ల్యాబ్ పంపించిన టెస్టు రిపోర్టులో నెయ్యి కల్తీ అయినట్లు తేలింది. నాణ్యమైన నెయ్యి ఎస్ వాల్యూ 95.68 …
Read More »ఏపీలో రేపటి నుంచి కొత్త కార్యక్రమం.. ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. “ఇది మంచి ప్రభుత్వం” పేరుతో కొత్త కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ప్రారంభించనున్నారు. ఈనెల 19వ తేదీ నుంచి 6రోజుల పాటు ఈ “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా సీఎం చంద్రబాబు ట్విటర్ వేదికగా వెల్లడించారు. అంతేకాకుండా ఈ “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను కూడా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో …
Read More »ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందా, ఉండదా?.. ఒక్కమాటలో తేల్చేసిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందా? లేదా?. కొద్దిరోజులుగా ఇదే కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్డీయే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల సమావేశంలో వాలంటీర్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో జగన్ గొప్పగా చెప్పుకొనే వాలంటీర్ల పదవీకాలం ఏడాది కిందటే ముగిసింది అన్నారు. గత ప్రభుత్వం వాలంటీర్లతో ఒప్పందాన్ని పునరుద్ధరించలేదని.. ఎన్నికలకు ముందు తాత్కాలికంగా 3 నెలల జీతాలను చెల్లించినట్లు వివరించారు. ఎన్నికలకు ముందు కొందరు వాలంటీర్లు రాజీనామా చేశారని.. మిగిలినవారి పదవీకాలం ముగిసింది అన్నారు. వాలంటీర్ల పదవీకాలం రెన్యువల్ చేయలేదని.. …
Read More »ఏపీ ప్రభుత్వం నుంచి లోన్ తీసుకున్న మహిళా మంత్రి.. ఎందుకో తెలుసా?, ఎంత తీసుకున్నారంటే!
ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమశాఖల మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రభుత్వం నుంచి లోన్ తీసుకున్నారు. మంత్రి సొంత కారు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల రుణం మంజూరు అయ్యింది. ఆ మొత్తాన్ని మంత్రి సంధ్యారాణి వేతనం నుంచి 30 వాయిదాల్లో ప్రభుత్వం మినహాయించుకుంటుంది. మంత్రి ప్రభుత్వం నుంచి లోన్ తీసుకోవడం చర్చనీయాంశమైంది. మంత్రులు ప్రభుత్వం నుంచి ఇలా లోన్ తీసుకుని.. జీతంలో నుంచి మినహాయించుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చంద్రబాబు …
Read More »ఏపీలో రైతుల అకౌంట్‌లలో డబ్బులు.. ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చేశాయి
ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ కింద రూ. 5,78,18,000 అందజేసేందుకు ప్రభుత్వం పాలనాపరమైన ఆమోదాన్ని తెలిపారు. ఈ మేరకు అధికారులు ఉత్తర్వులు జారీచేసింది.. జులైలో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో ఉద్యానపంటల రైతులు 8,376 మంది నష్టపోయారని గుర్తించారు.. బాధిత రైతులకు డీబీటీ కింద ఇన్‌పుట్ సబ్సిడీ అందజేయాలని సిసోడియా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరోవైపు ఏపీలో జులైలో కురిసిన భారీవర్షాలకు దెబ్బతిన్న ఎండీఆర్ (జిల్లా ప్రధాన రహదారులు), రాష్ట్ర హైవేల మరమ్మతులు, …
Read More »అనంతపురం వరకు ఆ రైలు పొడిగింపు.. బెంగళూరుకు ఈజీగా వెళ్లొచ్చు
ఉమ్మడి అనంతపురం జిల్లా వాసులకు రైల్వేశాఖ తీపికబురు చెప్పింది. బెంగళూరు-పుట్టపర్తి ప్యాసింజర్ రైలు (06515/06516)ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్యాసింజర్ రైలును పుట్టపర్తి వరకు కాకుండా అనంతపురం వరకు పొడిగించినట్లు అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు. ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి నిత్యం బెంగళూరుకు రాకపోకలు ఉంటాయి.. ఇప్పుడు ఈ రైలును అనంతపురం వరకు పొడిగిస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రయాణికులు చెబుతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలు పుట్టపర్తితో పాటుగా బెంగళూరుకు వెళ్లేందుకు రైలు సౌకర్యం కల్పించాలని అంబికా లక్ష్మీనారాయణ …
Read More »3 నెలల్లో 4 కొత్త సర్వీసులు ప్రారంభం.. రామ్మోహన్ నాయుడా మజాకా!
ఏపీ వాసులకు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మో్హన్ నాయుడు గుడ్ న్యూస్ వినిపించారు. త్వరలోనే గన్నవరం నుంచి దుబాయి, సింగపూర్‌లకు విమాన సర్వీసులు ప్రారంభిస్తామని తెలిపారు. గన్నవరం విమానాశ్రయం అభివృద్ధి మీద స్పెషల్ ఫోకస్ పెడతామన్న మంత్రి.. విజయవాడ నుంచి విమాన ప్రయాణికుల సంఖ్యను పెంచుతామన్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో అప్రోచ్ రహదారిని, విజయవాడ- ఢిల్లీ ఇండిగో సర్వీసును మంత్రి శనివారం ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన రామ్మోహన్ నాయుడు.. తాము అధికారంలోకి వచ్చిన మూడు నెలల కాలంలోనే నాలుగు కొత్త సర్వీసులు ప్రారంభించినట్లు …
Read More »