Tag Archives: andhra pradesh

డిప్యూటీ సీఎం గారి విజ్ఞప్తి.. ఇక నుంచి వారంలో ఒక్కరోజైనా ఆ పని చేయండి

AP Deputy CM: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక విజ్ఞప్తి చేశారు. ఇక నుంచి వారంలో ఒక్క రోజైనా ప్రజలు.. చేనేత వస్త్రాలు ధరించాలని సూచించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ఉపముఖ్యమంత్రి.. ప్రజలకు ఈ సూచన చేశారు. ఈ క్రమంలోనే చేనేత కార్మికులను ఆదుకోవాలని పవన్ కళ్యాణ్ కోరారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇదే రకమైన విజ్ఞప్తి చేశారు. నెలకు ఒకసారైనా ప్రజలు చేనేత వస్త్రాలు ధరించాలని హితవు పలికారు. జాతీయ చేనేత …

Read More »

ఏపీలో అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ.. తక్కువ ధరకే లిక్కర్

AP Cabinet: ఏపీలో కొత్త మద్యం పాలసీ అమలు కానుంది. అక్టోబర్ 1 వ తేదీ నుంచి ఏపీలో కొత్త మద్యం పాలసీని అమలు చేయనున్నట్లు.. ఏపీ కేబినెట్ సమావేశం తర్వాత మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు. ఇక ఇదే మీడియా సమావేశంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ భేటీకి సంబంధించిన పలు కీలక అంశాలను మంత్రి వివరించారు. కొత్త మద్యం పాలసీ, క్యూఆర్ కోడ్‌తో కూడిన పాస్ పుస్తకాల పంపిణీ.. జగన్ బొమ్మ, పేరు ఉన్న సర్వే రాళ్లను …

Read More »

ఆంధ్రప్రదేశ్‌లో యూట్యూబ్ అకాడమీ.. సీఎం చంద్రబాబు కీలక చర్చలు

CM Chandrababu talks with Youtube CEO on Academy in AP:ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పెట్టుబడుల ఆకర్షణపై దృష్టిపెట్టారు. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో ప్రభుత్వ యంత్రాంగం మీద పట్టు పెంచుకున్న చంద్రబాబు.. ఇప్పుడు హామీల అమలు, పెట్టుబడుల ఆకర్షణపై ఫోకస్ పెట్టారు. ఏపీలో అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టేలా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం యూట్యూబ్ సీఈవో నీల్ మోహన్, గూగుల్ ఏపీఏసీ హెడ్ సంజయ్ గుప్తాలతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో …

Read More »

మద్యం దుకాణాల్లో వారికి రిజర్వేషన్లు.. చంద్రబాబు నిర్ణయం..!

ఏపీలో నూతన మద్యం పాలసీ రూపకల్పనకు కసరత్తు చేస్తున్న ప్రభుత్వం.. ఆ దిశగా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వం అనుసరించిన మద్యం విధానంలో అవకతవకలు చోటుచేసుకున్నాయని టీడీపీ కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే మద్యం అక్రమాలపై సీఐడీ విచారణకు సైతం ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే తాము అధికారంలోకి వస్తే నూతన మద్యం విధానం తెస్తామని.. నాణ్యమైన బ్రాండ్లను అందుబాటులో ఉంచుతామని ఎన్నికల సమయంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. ఇక ఇచ్చిన మాట ప్రకారం అక్టోబర్ ఒకటో తేదీ నుంచి …

Read More »

ఏపీలో ప్రభుత్వ టీచర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై ఆ బాధ ఉండదు, ఆదేశాలు వచ్చేశాయి

ఆంధ్రప్రదేశ్‌‌ ప్రభుత్వం టీచర్లకు శుభవార్త చెప్పింది. మరుగుదొడ్ల ఫొటోలు తీసి, అప్‌లోడ్‌ చేసే విధానాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో స్కూళ్లలో బాత్రూమ్‌ల ఫొటోలు తీసే బాధ్యతను ఉపాధ్యాయులకు అప్పగించారు. అంతకముందు ఆ పనిని ప్రధానోపాధ్యాయులు చేయాలని చెప్పినా.. యాప్‌ల భారం పెరిగిందంటూ రోజుకో ఉపాధ్యాయుడు చొప్పున ఫొటోలు తీసి, యాప్‌లో అప్‌లోడ్‌ చేసేవాళ్లు. ఈ నిర్ణయంపై ఉపాధ్యాయుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఐఎంఎంఎస్‌ యాప్‌లో బాత్రూమ్‌లో ఫొటోలు …

Read More »

జగన్ సర్కార్ ఆ ప్రాజెక్టులన్నీ కొనసాగిస్తాం.. సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల విషయంలో వెనక్కి వెళ్లేది లేదంటున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తమకు విధ్వంసం చేయాలన్న ఆలోచన లేదని.. 2014-2019 మధ్య టీడీపీ ప్రభుత్వం పీపీపీ (పబ్లిక్, ప్రైవేట్‌ భాగస్వామ్యం) విధానంలో పోర్టులను పూర్తి చేయాలని భావించిందని గుర్తు చేశారు. కానీ గత జగన్ ప్రభుత్వం వాటిని ఈపీసీ (ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌) విధానానికి మార్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఇపపుడు ప్రభుత్వం నుంచి గ్రాంట్ ఇవ్వడం భారంగా ఉందని.. ఒకవేళ ఆ నిబంధనలను …

Read More »

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు

ఏపీకి  వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. బంగాళాఖాతంలో పశ్చిమబెంగాల్‌కు సమీపంలో శుక్రవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. వచ్చే 24 గంటల్లో పశ్చిమ-వాయవ్య దిశగా పయనించి వాయుగుండంగా మారనుందని ఐఎండీ తెలిపింది. ఈ ప్రభావంతో శనివారం నుంచి ఈ నెల 6 వరకు పశ్చిమబెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్‌లలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై ఉండదని వాతావరణశాఖ తెలిపింది. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు …

Read More »

ఏపీలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ప్రభుత్వ ఉద్యోగులు ఖుషీ.. 

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఒకటో తేదీన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు పెన్షన్లు జమ చేసింది. ఆగస్టు 1నే జీతాలు జమ చేయడంపై ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. మంత్రి నారా లోకేష్ దీనిపై స్పందించారు.. ఓ ఉద్యోగి వీడియోను ట్వీట్ చేశారు. ‘ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే పడిన జీతాలు.. ఆనందమయ జీవితాలు. ఇదీ కూటమి ప్రభుత్వం సమర్ధ పాలనకు నిదర్శనం’ అన్నారు. ఒకటో తేదీన జీతాలు పడ్డాయంటూ ఓ ఉద్యోగి పలకపై రాశారు.. గురువారం ఉదయం 7.45 నిమిషాలకు జీతం అకౌంట్‌లో …

Read More »

ఏపీలో ఈ పింఛన్లు తీసుకునేవారికి కూడా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా ఆలోచన చేస్తోంది. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసేందుకు సిద్ధం కాగా.. తాజాగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ పింఛన్లు అందుకునేవారికి కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని భావిస్తోంది ప్రభుత్వం. అనారోగ్య సమస్యమలతో బాధపడుతూ వైద్య సేవలు పొందేందుకు వీలుగా ఉచితంగా బస్సుపాస్‌లు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. గుండెజబ్బులు, కిడ్నీ, పక్షవాతం, లివర్, థలసేమియా, లెప్రసీ, సీవియర్‌ హీమోఫిలియా వంటి సమస్యలున్నవారికి ఈ ఫ్రీ బస్సు సౌకర్యం అందించాలని భావిస్తున్నారు. ఇలా …

Read More »

డిప్యూటీ సీఎం ఆదేశాలు.. కాకినాడలో ఆ చెట్టు కనిపిస్తే చాలు ఖతమే..

కాకినాడ జిల్లాలో ఆ మొక్క కనిపిస్తే చాలు.. అధికారులు కస్సుమంటున్నారు. కూకటివేళ్లతో సహా పెకిలించి వేస్తున్నారు. ఏంటా.. ఎందుకా కోపం అనుకుంటున్నారా.. ఆ మొక్క వలన సమాజానికి కీడే తప్ప మేలు లేదనే ఉపయోగంతో అధికారులు ఈ చర్యలు తీసుకుంటున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం, పర్యావరణం, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కాకినాడ జిల్లాలో కోనోకార్పస్ చెట్లను తొలగించే ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా 35 వేలకు పైగా ఈ కోనో కార్పస్ చెట్లు ఉన్నట్లు లెక్కలు …

Read More »