Tag Archives: andhra pradesh

దూసుకొస్తున్న ‘దానా’.. ఏపీ సహా నాలుగు రాష్ట్రాలకు ముప్పు.. అలర్ట్ చేసిన ఐఎండీ

తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా అనంతరం బుధవారం ఉదయానికి తుఫానుగా మారింది. ఇప్పటికే ఈ తుఫానుకు ‘దానా’ అనే పేరును ఐఎండీ సూచించగా… గురువారం తెల్లవారుజామున (అక్టోబరు 24) ఇది తీవ్ర తుఫానుగా మారుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) పేర్కొంది. ప్రస్తుతం ఒడిశాలోని పారాదీప్‌కు ఆగ్నేయంగా 670 కిలోమీటర్లు, పశ్చిమ్ బెంగాల్‌లోని సాగర్ ఐల్యాండ్‌కు దక్షిణ-ఆగ్నేయంగా 720 కిలోమీటర్లు, బంగ్లాదేశ్‌లోని ఖేపుపురకు దక్షిణ-ఆగ్నేయంగా 700 కిలోమీటర్ల దూరంలో కేంద్రకృతమై ఉన్న ఈ తుఫాను గత ఆరు గంటలుగా గంటకు …

Read More »

ఏపీ వాసుల మెట్రో కల నెరవరబోతోందా?.. ఇదిగో లేటెస్ట్ అప్‌డేట్

ఏపీ వాసుల మెట్రో కల నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. దానికి అనుగుణంగానే ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ మంత్రులు.. మెట్రో ప్రాజెక్ట్‌లపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు. తాజాగా.. కేంద్రమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌తో సమావేశమయ్యారు ఏపీ మున్సిపల్‌ మంత్రి నారాయణ. విశాఖపట్నం, విజయవాడ మెట్రో ప్రాజెక్టుల గురించి ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ రెండు మెట్రో ప్రాజెక్టులపై ఇరువురు మధ్య కీలక చర్చ జరగ్గా.. ఏపీ మెట్రో ప్రాజెక్టులను త్వరగా ముందుకు తీసుకెళ్లాలని కేంద్రమంత్రి ఖట్టర్‌కు విజ్ఞప్తి చేశారు మంత్రి నారాయణ. …

Read More »

తిరుమల శ్రీవారి భక్తులకు అద్భుత అవకాశం.. దర్శనం, గదులు బుక్ చేస్కోండి

తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యమైన గమనిక. తిరుమ‌ల శ్రీ‌వారి దర్శనం, ఆర్జిత సేవలు, వసతి గదులకు సంబంధించి 2025 జనవరి నెల కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తోంది. టీటీడీ జనవరి నెల‌కు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఇవాళ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తుంది. అలాగే శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన జనవరి నెల ఆన్ లైన్ కోటాను ఇవాళ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేస్తోంది. వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా …

Read More »

ఏపీలో విద్యార్థులకు శుభవార్త.. అకౌంట్‌లలో డబ్బుల జమ, మంత్రి లోకేష్ కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు శుభవార్త చెప్పారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లిస్తామని ప్రకటించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.3,500 కోట్లు చెల్లించకుండా మోసం చేసిందన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి మంత్రివర్గం, ఉన్నతాధికారులతో చర్చిస్తున్నట్లు తెలిపారు. ‘త్వరలోనే మీరు శుభవార్త వింటారని హామీ ఇస్తున్నా. నేను మీతోనే ఉన్నా’ అంటూ ట్వీట్ చేశారు. ఇవాళ కేబినెట్ భేటీలోనే నిధుల విడుదలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది అంటున్నారు. ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌ కోసం కొంతకాలంగా విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా డిగ్రీ, ఇంజినీరింగ్‌ …

Read More »

TCS Campus in Vizag: విశాఖలో క్యాంపస్ ఏర్పాటు.. ప్లాన్ మార్చిన టీసీఎస్!.. అక్కడేనా?

ఏపీలోని యువతకు శుభవార్త.. విశాఖపట్నంలో టీసీఎస్ క్యాంపస్ ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. టాటా సన్స్ బోర్డు ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌తో భేటీ అనంతరం.. ఏపీలో టీసీఎస్ క్యాంపస్ ఏర్పాటు చేయనున్నట్లు ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అనంతరం 100 రోజుల్లోనే విశాఖపట్నంలో టీసీఎస్ క్యాంపస్‌కు శంకుస్థాపన చేస్తామని.. నారా లోకేష్ ఇటీవల మరోసారి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వైజాగ్‌లో టీసీఎస్ క్యాంపస్ ఏర్పాటు కోసం ప్రయత్నాలు వేగంగా జరుగుతున్నాయి. అయితే వేగంగా టీసీఎస్ క్యాంపస్ ఏర్పాటు …

Read More »

అనంతపురాన్ని ముంచెత్తిన పండమేరు.. విజయవాడ వరదల్లాగే, నీట మునిగిన కాలనీలు

విజయవాడను బుడమేరు వరద ముంచెత్తితే.. అనంతపురంపై పండమేరు విరుచుకుపడింది. సోమవారం నుంచి కురుస్తున్న వర్షాలకు నగరంలోని కాలనీలు నీటమునిగాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షం దెబ్బకు.. అనంతపురంనకు ఆనుకుని ఉన్న పండమేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.. దీంతో వాగుకు ఇరువైపులా ఉన్న కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. వాగుకు అంతకంతకు వరద ప్రవాహం పెరుగడంతో ప్రజలు ఇళ్లపైకి ఎక్కి సాయం కోసం ఎదురుచూశారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. వర …

Read More »

చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌పై అసభ్యకర పోస్టులు.. వైసీపీ నేత అరెస్ట్, ఆ వెంటనే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌లపై సోషల్‌ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఇంటూరి రవికిరణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లా గుడివాడ వన్‌టౌన్‌ పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు తరలించగా.. న్యాయమూర్తి బెయిలు మంజూరు చేశారు. ఆగస్టు 17న టీడీపీ సోషల్‌ మీడియా కన్వీనర్‌ అసిలేటి నిర్మల ఇంటూరి రవికిరణ్‌పై గుడివాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు నాయుడు, పవన్‌కల్యాణ్, లోకేశ్‌లపై తీవ్ర అసభ్య పదజాలంతో అసభ్యకరంగా కార్టూన్లు సృష్టించి …

Read More »

హడ్కో నిర్ణయంతో అమరావతికి మహర్దశ.. ఏకంగా రూ.11వేల కోట్లు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. . రాజధాని నిర్మాణం కోసం సీఆర్డీఏకు రూ. 11 వేల కోట్ల రుణం మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంత్రి నారాయణ ఢిల్లీలో హౌసింగ్, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (హడ్కో) సీఎండీని కలిశారు. అమరావతి నిర్మాణంలో ప్రభుత్వ ఆలోచన విధానాన్ని వివరించగా.. రూ.11వేల కోట్ల ఈ రుణానికి సంబంధించి హడ్కో ఛైర్మన్, సీఎండీ (మేనేజింగ్‌ డైరెక్టర్‌) సంజయ్‌ కుల్‌ శ్రేష్ఠ హామీ ఇచ్చారని మంత్రి నారాయణ తెలిపారు. మరో రూ. 165 కోట్ల రుణం విడుదలకూ …

Read More »

ఏపీలో మందుబాబులకు శుభవార్త.. ఇక పండగ చేస్కోండి

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం పాలసీ గతవారమే మొదలైంది. వారం రోజులుగా కొత్త మద్యం షాపుల్లో అమ్మకాలు కొనసాగుతున్నాయి.. అన్ని బ్రాండ్ల మద్యం కూడా అందుబాటులోకి వచ్చింది. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన క్వార్టర్‌ రూ.99 మద్యం కూడా షాపుల్లో అందుబాటులోకి వస్తోంది. ఈ నెలాఖరు నాటికి 2.4 లక్షల కేసులు అందుబాటులోకి తీసుకొస్తామని ఎక్సైజ్‌ శాఖ తెలిపింది. రూ.99కే క్వార్టర్ మద్యానికి క్రేజ్ పెరిగింది. మరికొన్ని కంపెనీలు కూడా తక్కువ ధరకు నాణ్యమైన మద్యం తీసుకొస్తే ఎలా ఉంటుందని ఆసక్తి కనబరుస్తున్నాయట. …

Read More »

ఏపీకి తుఫాన్ ముప్పు.. ఈ ఐదు జిల్లాలపై తీవ్ర ప్రభావం, వాతావరణశాఖ అలర్ట్

ఆంధ్రప్రదేశ్‌కు మరో ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్ ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.. బంగాళాఖాతంలో సోమవారం ఉదయం ఏర్పడిన అల్పపీడనం సాయంత్రానికి తీవ్రంగా బలపడింది. ఇది మంగళవారం ఉదయానికి వాయుగుండంగా బలపడింది.. బుధవారం నాటికి తుఫాన్‌గా, గురువారం నాటికి తీవ్ర తుఫాన్‌గా మారొచ్చని ఐఎండీ చెబుతోంది. ఈ తుఫాన్ గురువారం అర్ధరాత్రి లేదా శుక్రవారం తెల్లవారుజామున పూరీ (ఒడిశా), సాగర్‌ ద్వీపం (పశ్చిమ బెంగాల్‌) మధ్యలో తీరం దాటొచ్చని అంచనా వేస్తున్నారు. ఇది తుఫాన్‌గా బలపడితే ఖతర్‌ సూచించిన దానా …

Read More »