Tag Archives: andhra pradesh

సీఎం చంద్రబాబుతో ఒకరోజు.. ఎన్ఆర్ఐలకు బంపర్ ఆఫర్.. ముందుగా ఆయనకే అవకాశం..

సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన వారిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారు ముఖ్యమంత్రిని కలిసి ఒక రోజంతా ఉండే అవకాశాన్ని తెలుగుదేశం పార్టీ కల్పించింది. ఈ కాన్సెప్ట్‌తో రూపొందించిన డే విత్ సీబీఎన్ కార్యక్రమంలో భాగంగా స్వీడన్‌కు చెందిన ఎన్ఆర్ఐ ఉన్నం నవీన్ కుమార్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఇంటికి ఆహ్వానించారు.టీడీపీ అధికారంలోకి రావడానికి విదేశాలనుంచి వచ్చి కష్టపడిన ఎన్ఆర్ఐలకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది టీడీపీ అధిష్టానం.. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఏకంగా వన్ డే అంతా ఉండే అవకాశం కల్పించింది. …

Read More »

 పెద్దల సభలో జెండా పాతడమే లక్ష్యం.. ఏపీ నుంచి కొత్త రాజ్యసభ సభ్యులు వీళ్ళే..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల హడావిడి మొదలైంది. ముగ్గురు సభ్యుల రాజీనామాతో ఖాళీ అయిన స్థానాలకు మంగళవారం(డిసెంబర్ 3) నుంచి నామినేషన్ల పక్రియ ప్రారంభమైంది. డిసెంబర్ 10 వరకు నామినేషన్ దాఖలు చేసేందుకు గడువు ఉంది. మరి, రాజ్యసభ రేసులో ఎవరున్నారు?. ఏ పార్టీ నుంచి ఎవరు సీటు ఆశిస్తున్నారు?. అన్నదీ ఆసక్తికరంగా మారింది. వైఎస్ఆర్సీపీ సభ్యులుగా కొనసాగిన మోపిదేవి వెంకట రమణ, బీదా మస్తాన్ రావు, అర్ కృష్ణయ్యలు రాజీనామా చేయడంతో ఈ ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ రాజీనామాలు రాష్ర్టంలో …

Read More »

పదో తరగతి విద్యార్ధులకు అలర్ట్‌.. మార్చి 15 నుంచి టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలు! త్వరలో టైం టేబుల్ విడుదల

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి వచ్చే ఏడాది మార్చిలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పరీక్ష ఫీజు చెల్లింపుల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. డిసెంబర్ నెలాఖరు వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలను మార్చి 15వ తేదీ నుంచి నిర్వహించాలని పాఠశాల విద్యా శాఖ భావిస్తున్నట్లు తెలుస్తుంది. మార్చి నెలాఖరుకల్లా పరీక్షలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు పరీక్షల టైమ్‌ టేబుల్‌ను రూపొందించి, ప్రభుత్వ పరిశీలనకు పంపించినట్టు సమాచారం. ఈ …

Read More »

టీడీపీలోకి మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని.. నేడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో చేరిక

ఏలూరు అసెంబ్లీ నుంచి 4సార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆళ్లనాని.. రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పారు.అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో అధికారం చేతులు మారింది. రాజకీయమూ రంగులు మార్చింది. కానీ, ఏలూరులో మాత్రం రోజుకో మలుపు తిరుగుతోంది. ముఖ్యంగా వైసీపీ నుంచి బయటకు వచ్చిన కీలక నేతలు ఒక్కొక్కరు గా తెలుగు దేశం పార్టీలో చేరిపోయారు. చివరికి మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని(కాళీకృష్ణ శ్రీనివాస్‌) కూడా సైకిల్ ఎక్కేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఏలూరు జిల్లా రాజకీయాల్లో ఒక్కసారిగా అలజడి …

Read More »

ఆసియాలోనే రెండవ అతిపెద్ద బస్ టెర్మినల్.. PNBS బస్టాండ్ చరిత్ర తెలుసా..?

విజయవాడ బస్ స్టేషన్‌ను పండిట్ నెహ్రూ బస్ స్టేషన్‌గా పిలుస్తారు. దీనిని తెలుగు శాతవాహన ప్రయాణ ప్రాంగణం అని కూడా పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవ్వరూ ఏ మారుమూల ప్రాంతం నుంచైనా మరో ప్రాంతానికి బస్సులో వెళ్లాలంటే, విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్‌ టచ్ చేసి వెళ్లాల్సిందే..! ఎందుకంటే రాష్ట్రానికి సెంటర్ పాయింట్‌గా ఉన్న విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ ఉమ్మడి రాష్ట్రంలోనే అతిపెద్ద బస్ స్టాండ్. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని అప్పటి ప్రభుత్వం విజయవాడ పండిట్ నెహ్రూ బస్ …

Read More »

పవన్ ‘సీజ్ ది షిప్’ తర్వాత రగులుతున్న రాజకీయం.. రచ్చ మామూలుగా లేదుగా..

చౌకబియ్యం చుట్టూ జరుగుతున్న రాద్ధాంతం.. ఏపీ రాజకీయాల్ని ఉడుకెత్తిస్తోంది. సీజ్‌ ది షిప్.. అంటూ కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం మొదలుపెట్టిన బియ్యం గొడవ ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. ఇంతకీ.. ఆ బియ్యం ఎవరివి.. అని ఆరా తీస్తే.. మంత్రిగారి వియ్యంకుడి పేరే బైటికొస్తోంది. ఇంకేముంది విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఇష్యూని మరింత సీరియస్‌ చేస్తూ బాంబులు పేల్చాయి. మరి కూటమి ప్రభుత్వం రియాక్షన్లేంటి..? రెండుగంటల పాటు జరిగిన భేటీలో సీఎం, డిప్యూటీ సీఎం తేల్చిందేంటి…? డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ మొన్న కాకినాడ పోర్టులో హల్‌చల్ చేసి.. …

Read More »

స్కూల్‌ విద్యార్థులకు షాక్‌.. భారీగా తగ్గనున్న సంక్రాంతి సెలవులు? ఎందుకంటే

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులకు షాకింగ్‌ న్యూస్ చెప్పింది. వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న పబ్లిక్‌ పరీక్షల నేపథ్యంలో సంక్రాంతి సెలవులను భారీగా కుదించనుంది. పదో తరగతి పరీక్షల తేదీలు దాదాపు ఖరారు అయినట్లే. విద్యాశాఖ రూపొందించిన టైం టేబుల్‌ ప్రభుత్వ పరిశీలనకు కూడా పంపించారు. రేపే మాపో అధికారిక టైం టేబుల్‌ వెలువడే అవకాశం ఉంది. ఈ క్రమంలో పదో తరగతిలో అత్యుత్తమ ఫలితాలు రాబట్టేందుకు సోమవారం 100 రోజుల యాక్షన్‌ ప్లాన్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. టెన్త్ పబ్లిక్‌ …

Read More »

ISRO: మరో ఘనత సాధించేందుకు అడుగు దూరంలో ఇస్రో.. ఏకంగా సూర్యుడిపై అధ్యయనం కోసం..!

ఈ ప్రోబా..3 ఆకాశంలో కృత్రిమ సూర్యగ్రహణాన్ని సృష్టించేందుకు, సూర్యుని బాహ్య వలయం కరోనాని అధ్యయనం చేసేందుకు యూరోపియన్ ప్రయోగాన్ని తలపెట్టింది.భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మరో కమర్షియల్ రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ భారత్‌కు చెందిన న్యూ స్పేస్ ఇండియా లిమిటడ్(NSIL) సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా యూరోపియన్ ఏజెన్సీ కి చెందిన ప్రోబా-3 ఉపగ్రహాన్ని ఇస్రో శ్రీహరికోట నుండి డిసెంబర్ నాలుగవ తేదీ సాయంత్రం నింగిలోకి పంపేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు పీఎస్ఎల్వీ-సి59 రాకెట్ ప్రయోగాన్ని ప్రయోగించనున్నారు. తిరుపతి జిల్లా …

Read More »

పండు, తొక్క మాత్రమే కాదు, దానిమ్మ ఆకులతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?

దానిమ్మ ఆకులో విటమిన్ సి, కాల్షియం, మెగ్నీషియం, పోటాషియం, ఐరన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతాయి. రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్, ట్రిగ్లైసెరైడ్లను తగ్గించి, రక్తపోటు నియంత్రించడంలో సహాయపడుతాయి. దానిమ్మ ఆకుల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్థాలు క్యాన్సర్‌కు కాణమయ్యే కణాలను త్వరగా పెరగకుండా ఆపటంలో సహాయపడుతాయి. దానిమ్మ ఆకులు రొమ్ము క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, పెద్దప్రేగు కాన్సర్ ల చికిత్సలో కూడా సహాయపడుతాయి . దానిమ్మ ఆకుల కషాయాన్ని ఆయుర్వేదంలో కుష్టు వ్యాధి, …

Read More »

ఉద్యోగుల శిక్షణకు స్వదేశీ ఫ్రేమ్‌వర్క్‌.. స్వతంత్ర భారతదేశంలో తొలిసారిగా..

ఫ్రేమ్‌వర్క్‌లోని అంశాలపై కమిషన్ ఎలా నిర్ణయం తీసుకుందనే దానిపై బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. ‘భారతదేశ భవిష్యత్తును నిర్దేశించడానికి ప్రధాని మోదీ చెప్పిన విషయాలను పరిగణలోకి తీసుకున్నాము. ప్రధాని మోదీ చెప్పిన వికాస్‌, గర్వ, కర్తవ్య, ఐక్యత అనే నాలుగు సందేశాలను గుర్తించాము. ఈ నాలుగు తీర్మానాలను సాధించడానికి, ప్రభుత్వ అధికారులు…స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటిసారి భారతదేశంలో నైపుణ్యాభివృద్ధికి స్వదేశీ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించింది కేంద్ర ప్రభుత్వం. 2047 నాటికి విక్షిత్‌ భారత్‌ అనే మోదీ గారి లక్ష్యానికి అనుగుణంగా ఈ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించారు. ఆధునిక బ్యూరోక్రసీకి శిక్షణ …

Read More »