Tag Archives: AP Assembly Budget

3 లక్షల కోట్లతో ఏపీ పూర్తిస్థాయి బడ్జెట్.. అభివృద్ధికే అధిక కేటాయింపులు

అసెంబ్లీలో మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. రూ.3,22,359.33 కోట్లతో ఏపీ బడ్జెట్‌ ఉండగా.. రెవెన్యూ వ్యయం అంచనా- రూ.2,51,162 కోట్లని చెప్పారు. గత ప్రభుత్వ తప్పిదాలను.. నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఎండగట్టిన ఆర్థిక మంత్రి. వైసీపీ ప్రభుత్వ ఆర్థిక అరాచకత్వాన్ని హిరోషిమాపై అణుదాడితో పోల్చారు పయ్యావుల. తమ పిల్లల భవిష్యత్ కోసం 2024 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారు. చంద్రబాబు తొలిసారి సీఎం అయినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉండేవో.. ఇప్పుడూ అంతకు మించిన స్థాయిలో దారుణమైన పరిస్థితులు …

Read More »

ఏపీ అసెంబ్లీ సమావేశాలు అంతా సిద్దం.. వైఎస్ జగన్ హాజరు.. మరోసారి ప్రతిపక్ష హోదా తెరపైకి.!

ఇవాళ్టి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమరం ప్రారంభం కాబోతోంది. అయితే, సమావేశాలకు హాజరవుతున్నామని వైసీపీ ప్రకటించడంతో వాతావరణం ఆసక్తికరంగా మారింది. జగన్‌తో సహా ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష హోదాను డిమాండ్‌ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. అనంతరం సభ మరుసటి రోజుకు వాయిదా పడుతుంది. సభ వాయిదా పడిన తర్వాత బీఏసీ సమావేశంలో ఎన్ని రోజులపాటు సమావేశాలు నిర్వహించాలి, …

Read More »