Tag Archives: ap government

ఏపీలో ఇకపై స్మార్ట్‌ఫోన్‌లోనే అన్నీ.. ప్రజలకు ఇది కదా కావాల్సింది

ఏపీ ప్రజలకు అదిరిపోయే గుడ్ న్యూస్ అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.. వచ్చే కొద్దిరోజుల్లో అన్ని ప్రభుత్వ సర్టిఫికెట్లు.. 161 సర్వీసులు వాట్సాప్ ద్వారా ప్రజలకు అందనున్నాయి. అందుకు మెటాతో కూడా ఒప్పందం కుదుర్చుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఆ వివరాలు ఎలా ఉన్నాయంటే..సమీప భవిష్యత్‌లోనే ఆంధ్రప్రదేశ్ పౌరులకు భౌతిక ధృవీకరణ పత్రాల అవసరం లేకుండా, వారి స్మార్ట్‌ఫోన్ ద్వారానే అన్ని సేవలు పొందే అవకాశం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ విషయాన్ని ఐటీ, ఆర్టీజీ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటంనేని వెల్లడించారు. డేటా …

Read More »

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఇకపై బర్త్, డెత్ సర్టిఫికెట్లు ఈజీగా పొందొచ్చు..

ఏపీలో కీలక మార్పులు చేపట్టబోతుంది కూటమి సర్కార్. టెక్నాలజీ ద్వారా ప్రజలకు మరింత చేరువ అవ్వాలని చూస్తుంది. వాట్సప్ ద్వారా పౌర సేవలు అందించాలని ఏర్పాట్లు చేస్తుంది. ఇంతకీ వాట్సప్‌తో ఏమేం సేవలు అందించనున్నారు?. వాట్సప్ గవర్నెన్స్ ఎలా ఉండబోతుంది? ఆ వివరాలు ఇలా ఉన్నాయి.ఏపీ ప్రజలకు కూటమి సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో వాట్సాప్‌తో జనన, మరణ ధృవీకరణ పత్రాలు అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. మొదట తెనాలిలో దీనిని ప్రయోగాత్మకంగా చేపట్టి.. పరిశీలించాలని నిర్ణయించింది. ఆ తర్వాత,.. దీనిని రాష్ట్ర …

Read More »

మరో హామీ అమలుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు.. 3 కోట్ల మందికి ప్రయోజనం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో హామీ అమలుకు సిద్ధమవుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న ప్రభుత్వం మరో హామీ అమలుకు కసరత్తు ప్రారంభించింది. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. అయితే త్వరలోనే చంద్రన్న బీమా పథకాన్ని కూడా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని టీడీపీ కూటమి సర్కారు భావిస్తోంది. అయితే కుటుంబ పెద్దకు మాత్రమే కాకుండా ఇంట్లోని అందరినీ బీమా పరిధిలోకి తీసుకువచ్చేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. చంద్రన్న బీమా పథకం కిందకు రాష్ట్రంలోని పేదలను …

Read More »

మరో హామీ అమలుచేసిన ఏపీ ప్రభుత్వం.. వారికి ఫుల్ పవర్స్!

ఎన్నికల ప్రచారం సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం.. మరో హామీని అమలు చేసింది. కూటమి సర్కారు అధికారంలోకి వస్తే దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తామని అప్పట్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇక ఇచ్చిన హామీ ప్రకారం దేవాలయాల విషయంలో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో ఇకపై రాజకీయ, అధికార జోక్యానికి …

Read More »

రేపే అకౌంట్లలోకి డబ్బులు.. ఏపీ ప్రభుత్వం నిర్ణయం.. వారందరికీ బిగ్ రిలీఫ్

ఏపీలో వరద పరిహారం ఇంకా అందనివారికి బిగ్ రిలీఫ్.. వివిధ కారణాల వలన వరద పరిహారం అందని వారికి సోమవారం పరిహారం పంపిణీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. వరదల కారణంగా సుమారు నాలుగు లక్షల మంది ప్రభావితులయ్యారనే అంచనాతో ప్రభుత్వం వరద పరిహారం విడుదల చేసింది. మొత్తం రూ.602 కోట్లు విడుదల చేయగా.. ఇప్పటికే చాలా మందికి వారి బ్యాంకు ఖాతాల్లో పరిహారం మొత్తం జమైంది. అర్హులైన వారిలో ఇప్పటి వరకూ 98 శాతం మందికి పరిహారం జమ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. …

Read More »

ఏపీలో వారందరికి గుడ్‌న్యూస్.. ప్రతి నెలా రూ.10వేల నుంచి రూ.15 వేలకు పెంపు

ఆంధ్రప్రదేశ్‌లో అర్చకులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుభవార్త చెప్పారు. రాష్ట్రంలోని దేవాలయాల్లో అర్చకుల వేతనాలను భారీగా పెంచాలని నిర్ణయించారు. రూ.50వేలకుపైన ఆదాయం ఉన్న ఆలయాల్లో ప్రతి నెలా రూ.10 వేలు వేతనం పొందే అర్చకులకు ఇకపై రూ.15 వేలు ఇవ్వాలని ఆదేశించారు. ప్రభుత్వ నిర్ణయంతో 1,683 మంది లబ్ధిపొందనున్నారు. అమరావతి సచివాలయంలో దేవదాయ శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అంతేకాదు వేద విద్య చదువుకుని నిరుద్యోగులుగా ఉన్న వారికి నెలకు రూ.3 వేలు భృతి ఇవ్వాలని కూడా సూచించారు. …

Read More »

Employees transfers: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. గైడ్‌లైన్స్ విడుదల.. వారికి మాత్రం!

AP Govt Employees transfer Guidelines: ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఎన్ని రోజులుగానో ఉద్యోగులు ఎదురుచూస్తున్న బదిలీలకు ఆమోదం తెలిపింది. ఈ నెలాఖరు లోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై గైడ్‌లైన్స్ విడుదల అయ్యాయి. మొత్తం 12 శాఖల్లో ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. బదిలీలకు వీలుగా ఆగస్టు 19 నుంచి ఆగస్ట్ 31వ తేదీ వరకు ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని నిలిపివేస్తూ ఆదేశాలు జారీచేశారు. మరోవైపు అన్ని ప్రభుత్వ …

Read More »

స్పందన కార్యక్రమం పేరును పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్‌గా మారుస్తూ ఉత్తర్వులు..

“స్పందన”(Spandana) కార్యక్రమం పేరును “పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్‌”(Public Grievance Redressal System)గా పునరుద్ధరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్వర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని సీఎస్ పేర్కొన్నారు. అమరావతి: “స్పందన”(Spandana) కార్యక్రమం పేరును “పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్‌”(Public Grievance Redressal System)గా పునరుద్ధరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్(CS Nirab Kumar …

Read More »