మరో హామీ అమలుచేసిన ఏపీ ప్రభుత్వం.. వారికి ఫుల్ పవర్స్!

ఎన్నికల ప్రచారం సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం.. మరో హామీని అమలు చేసింది. కూటమి సర్కారు అధికారంలోకి వస్తే దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తామని అప్పట్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇక ఇచ్చిన హామీ ప్రకారం దేవాలయాల విషయంలో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో ఇకపై రాజకీయ, అధికార జోక్యానికి తావుండదు. ఆలయాల్లో పూజలు, ఆధ్యా్త్మిక కార్యక్రమాల నిర్వహణలో అర్చకులకే విస్తృత అధికారాలు ఉంటాయి. ఆలయ అధికారాల్లో ఇతరులు జోక్యం చేసుకోకుండా అర్చకులకే స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

ఇక ప్రభుత్వం ఇచ్చిన తాజా ఉత్తర్వుల కారణంగా ఆలయాల్లోని వైదిక విధుల్లో దేవాదాయ శాఖ కమిషనర్ సహా ఏ అధికారికి జోక్యం చేసుకునే అధికారం ఉండదు.అలాగే కుంభాభిషేకాలు, పూజలు, యాగాలు వంటివాటిల్లో దేవాలయాల ఆగమ నియమాల ప్రకారం వైదిక విధులు నిర్వహించుకునేలా అర్చకులకు అధికారాలు కల్పించింది. ఈ విషయాల్లో వారిదే తుది నిర్ణయమని.. అధికారులు జోక్యం చేసుకోరాదని స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఆధ్యాత్మిక విషయాల్లో ఏకాభిప్రాయానికి రాలేకపోతే పీఠాధిపతులను సంప్రదించవచ్చని… ప్రభుత్వం జీవోలో స్పష్టం చేసింది. అలాగే ఆలయ ఈవోలు వైదిక కమిటీలను ఏర్పాటు చేయాలని.. ఈ కమిటీల సూచనలు పాటించాలని ప్రభుత్వం ఆదేశాల్లో స్పష్టం చేసింది.

మరోవైపు కూటమి ప్రభుత్వం ఇటీవలే ఆలయాల్లో ధూపదీప నైవేద్యాల కోసం అందించే మొత్తాన్ని కూడా పెంచిన సంగతి తెలిసిందే. దేవాలయాల్లో ధూప,దీప నైవేద్యాల కోసం గతంలో ప్రతి నెలా రూ.5000 సాయంగా అందించేవారు. అయితే ఈ మొత్తాన్ని తాము అధికారంలోకి వస్తే పదివేలకు పెంచుతామని ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి హామీ ఇచ్చింది. ఇక ఇచ్చిన మాట ప్రకారం ఇటీవలే ఈ మొత్తాన్ని రూ.5000 నుంచి రూ.10000లకు పెంచారు. తాజాగా ఆలయాల్లో అర్చకులకు స్వయం ప్రతిపత్తి కల్పి్స్తూ నిర్ణయం తీసుకోవటంపై హిందూ సంఘాలు, అర్చకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

About amaravatinews

Check Also

రోజూ యాలకుల వాటర్ తాగితే అందం పెరుగుతుందా..? అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం…

యాలకులు.. ప్రతి వంటింట్లో తప్పనిసరిగా ఉండే సుగంధ్ర ద్యవ్యాలలో ఇది కూడా ఒకటి. వంటలకు రుచిని, సువాసన పెంచడానికి యాలకులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *