ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామక విధానంలో ప్రభుత్వం భారీ మార్పులు చేసింది. ఇకపై ఖాళీలకన్నా 200 రెట్లు ఎక్కువ అభ్యర్థులు ఉన్నప్పుడే స్క్రీనింగ్ టెస్ట్ చేస్తారు. చాలా పోస్టులకు ఒకే మెయిన్స్ పరీక్షతోనే ఎంపిక పూర్తవుతుంది. దీంతో నియామక ప్రక్రియ వేగవంతమవుతుందని, నిరుద్యోగుల ఖర్చు భారం తగ్గుతుందని ప్రభుత్వం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నిర్వహించే ఉద్యోగ నియామక ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. నిరుద్యోగులకు ప్రయోజనం కలిగేలా, నియామకాల్లో వేగం పెరిగేలా నూతన మార్గదర్శకాలతో ముందుకొచ్చింది. …
Read More »